స్వరం మార్చిన బొండా: తుదిశ్వాస వరకు టీడీపీలోనేనంటూ క్లారిటీ

By Siva KodatiFirst Published Aug 13, 2019, 9:56 AM IST
Highlights

తాను పార్టీ మారుతున్నట్లుగా గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తెరదించారు. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం బొండా మీడియాతో మాట్లాడారు.

సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఉమా వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఉమా విమర్శించారు. చివరి వరకు టీడీపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

కొద్దిరోజుల క్రితం న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన బొండా ఉమా బంగీ జంప్ చేశారు. ఆ ఫోటోను ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేసి.. బెజవాడ రాగానే సంచలనాలు ఉంటాయని తెలిపారు. దీంతో ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీని వీడుతున్నారని ప్రచారం జరిగింది.

ఉమా విదేశీ పర్యటన నుంచి విజయవాడ చేరుకోగానే. బొండాతో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న భేటీ అయ్యారు. ఉమ పార్టీ మారకుండా బుద్ధా బుజ్జగించారని.. దీంతో ఆయన పార్టీ మార్పు నిర్ణయాన్ని విరమించుకున్నారని బెజవాడలో టాక్ వినిపిస్తోంది. 

చంద్రబాబుతో బొండా ఉమ భేటీ

చంద్రబాబుతో భేటీకి బొండా ఉమ సై: పార్టీ మార్పుపై స్పష్టత

బుజ్జగింపులు: చంద్రబాబు దూతగా బొండా ఉమతో బుద్ధా వెంకన్న భేటీ

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ..?: జగన్ గూటికి టీడీపీ నేతల క్యూ

ఆ మాత్రం నమ్మకం లేదా.. బొండా ఉమ అసంతృప్తి

చంద్రబాబుకు షాక్: కాపు నేతలు డుమ్మా, బెజవాడ నేతలు బొండా ఉమా వంశీ సైతం...

click me!