మాధవ్ న్యూడ్ వీడియో వివాదం... బరితెగించిన వారిని అదుపులో పెట్టండి: డిజిపికి చంద్రబాబు సూచన

By Arun Kumar PFirst Published Aug 7, 2022, 1:48 PM IST
Highlights

న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై స్పందించి వెంటనే వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుప్పంలో ఆందోళనకు దిగిన టిడిపి శ్రేణులపై స్థానిక సీఐ దురుసుగా ప్రవర్తించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. 

అమరావతి : వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ లీక్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో వున్న గోరంట్ల చాలా నీచంగా ప్రవర్తించాడని... అతడిపై వైసిపి పార్టీ, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష టిడిపి డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గంలో మాధవ్ దిష్టిబొమ్మ దహనం చేపడుతుండగా అడ్డుకున్న స్థానిక సీఐ టిడిపి శ్రేణులతో దురుసుగా ప్రవర్తించడంపై ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వెంటనే బరితెగించిన పోలీసులను డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అదుపులో పెట్టాలని   చంద్రబాబు సూచించారు. 

గతంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసులంటే దేశంలోనే మంచి పేరు వుండేదని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాజకీయాల కోసం వాడుకుంటోందని... దీంతో పోలీసుల ప్రతిష్ట రోజురోజుకు దిగజారనుతోందన్నారు. కొందరు పోలీసులయితే మరీ దిగజారి వైసిపి నాయకులకు తొత్తుల్లా వ్యవహరిస్తూ యావత్ పోలీస్ శాఖకే తలవంపులు తెచ్చిపెడుతున్నారని అన్నారు. ఇలా కుప్పంలో కొందరు పోలీసులు తప్పు చేసినప్పటికీ అధికార పార్టీ పార్లమెంట్ సభ్యులను సమర్థించే నీచ స్థాయికి దిగజారారని చంద్రబాబు మండిపడ్డారు. 

Read more  హైదరాబాద్ అభివృద్దిలో అదే గేమ్ చేంజర్... నాకెంతో సంతృప్తి: న్యూడిల్లీలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

సభ్యసమాజం తలదించుకునేలా మహిళకు న్యూడ్ గా వీడియో కాల్ చేసిన ఎంపీ మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కుప్పంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారని... వీరితో స్థానిక సీఐ దౌర్జన్యంగా వ్యవహరించాడని చంద్రబాబు పేర్కొన్నారు. దేశాన్ని కాల్చండి అంటూ స్వయంగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యాఖ్యలు చెయ్యడాన్ని డీజీపీ సమర్థిస్తారేమో గాని ప్రజలు హర్షించరన్నారు. నిందితులకు బహిరంగంగానే పోలీసులు మద్దతు పలకడమే కాకుండా నిరసనలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ కుప్పం నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తమపై తప్పుడు కేసులు మాని....బరి తెగించిన అధికారులను అదుపులో పెట్టి పోలీసుశాఖ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత డీజీపీ పై ఉందని చంద్రబాబు సూచించారు. 

ఇదిలావుంటే చిత్తూరు జిల్లా పూతలపట్టులో కూడా ఇలాగే వైసిపి ఎమ్మెల్యేను ప్రశ్నించాడని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి యువకుడిపై కేసు పెట్టడంపై చంద్రబాబు స్పందించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసిపి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పూతలపట్టు మండలం వేపనపల్లిలో పర్యటించగా తనకు విద్యాదీవెన డబ్బులు రాలేవని ఇంజనీరింగ్ విద్యార్థి అడిగాడు. అంతేకాదు గ్రామంలో అభివృద్దిపై కూడా అతడు ప్రశ్నిస్తుండగా అడ్డుకున్న పోలీసులు యువకున్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీన్ని అడ్డుకున్న మరో ఎనిమిదిమంది గ్రామస్తులపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. 

వైసిపి ప్రభుత్వ పాలనపై గడపగడపలో  ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేత వ్యక్తం అవుతోందని... కాలర్ ఎగరేసుకుని ఎమ్మెల్యేలు తిరగడం కాదుగానీ జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేసారు సంక్షేమంలో కోతలు, అభివృద్ది పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతోందని... అందువల్లే పాలనను ప్రశ్నించిన ప్రతివారిపై కేసు పెట్టాలని చూస్తోందన్నారు. ఈ ప్రభుత్వం ఇలాగే  భావిస్తే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపైనా జగన్ కేసులు పెట్టాల్సి ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. 

వేపనపల్లి గ్రామంలో ఘటనకు వైసిపి క్షమాపణ చెప్పి విద్యార్థిపై, అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, టిడిపి నేతలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. వెంటనే అందరినీ విడుదల చెయ్యాలని... స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డిజిపి చర్యలు తీసుకోవాలి చంద్రబాబు డిమాండ్ చేసారు. 
 

click me!