ఎస్వీబీసీలో పోర్న్ సైట్ల లింకులు కలకలం రేపుతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాల్సిన చోట ఈ రకమైన సైట్లు చూస్తున్నట్టుగా అధికారుల విచారణలో తేలింది.
తిరుపతి: ఎస్వీబీసీలో పోర్న్ సైట్ల లింకులు కలకలం రేపుతున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాల్సిన చోట ఈ రకమైన సైట్లు చూస్తున్నట్టుగా అధికారుల విచారణలో తేలింది.
శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు ఎస్వీబీసీకి మెయిల్ చేశాడు. ఈ మెయిల్ కు స్పందనగా ఎస్వీబీసీ ఉద్యోగులు శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించిన లింక్ పంపాలి. కానీ దీనికి భిన్నంగా ఎస్వీబీసీ ఉద్యోగి ఒకరు భక్తుడికి పోర్న్ సైట్ లింక్ ను పంపాడు.
undefined
శతమానం భవతి కార్యక్రమానికి తిలకించేందుకు ఈ లింక్ ను ఓపెన్ చేసిన భక్తుడు షాక్ తిన్నాడు. ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రసారం కావాల్సిన లింక్ లో పోర్న్ సైట్ దర్శనం కావడంతో ఆయన అవాక్కయ్యాడు.
ఈ విషయమై భక్తుడు టీటీడీ ఈవో వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించాడు. ఈ ఘటనకు పాల్పడిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఈవో జవహర్ రెడ్డిని ఆదేశించారు.
దీంతో ఎస్వీబీసీ కార్యాలయంలో ఉద్యోగుల లీలలు వెలుగు చూశాయి. ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్, ఈడీపీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధికారులు కీలక విషయాలను గుర్తించారు. ఎస్వీబీసీ కార్యాలయంలో ఐదుగురు ఉద్యోగులు పోర్న్ సైట్లు చూస్తున్నట్టుగా గుర్తించారు.
ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో 25 మంది ఉద్యోగులు విధులు నిర్వహించకుండా ఇతర సైట్లు చూస్తున్నట్టుగా విచారణలో తెలుసుకొన్నారు. భక్తుడికి పోర్న్ సైట్ లింక్ ను పంపిన ఉద్యోగిని గుర్తించారు.
విధులు నిర్వహించకుండా పోర్న్ సైట్లు చూసిన ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకోనుంది.