డాక్టర్ శిల్ప సూసైడ్: కీలకంగా మారిన సెల్‌పోన్ డేటా, రంగంలోకి కలెక్టర్

By narsimha lodeFirst Published Aug 12, 2018, 5:16 PM IST
Highlights

డాక్టర్ శిల్ప కాల్ డేటాలో అన్నీ వివరాలు బయటకు వస్తాయని  చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అభిప్రాయపడ్డారు.  డాక్టర్ శిల్ప మృతిపై సిట్ వేగంగా విచారణను కొనసాగిస్తోందని చెప్పారు.


తిరుపతి: డాక్టర్ శిల్ప కాల్ డేటాలో అన్నీ వివరాలు బయటకు వస్తాయని  చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అభిప్రాయపడ్డారు.  డాక్టర్ శిల్ప మృతిపై సిట్ వేగంగా విచారణను కొనసాగిస్తోందని చెప్పారు.  ఈ కేసులో ఎవరినీ కూడ వదిలే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు.

డాక్టర్ శిల్ప  ఆత్మహత్య చేసుకొన్న తర్వాత ఎస్వీ మెడికల్ కాలేజీలో చోటు చేసుకొన్న పరిణామాలపై  చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న స్వయంగా తెలుసుకొన్నారు. శనివారం నాడు  ఆయన ఎస్వీ మెడికల్ కాలేజీని సందర్శించారు. ప్రభుత్వ డాక్టర్లు, ప్రోఫెసర్లతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు  కలెక్టర్ ప్రద్యుమ్నతో  చర్చించారు. డాక్టర్ శిల్ప ఇచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వం నివేదిక ఆలస్యం చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొందని చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక్కడ చోటు చేసుకొంటున్న పరిణామాలపై  ఎందుకు ఫిర్యాదు చేయలేదని జూడాలను  కలెక్టర్ ప్రద్యుమ్న ప్రశ్నించారు. శిల్ప ఆత్మహత్య నేపథ్యంలో ఎవరెవరు ఏం మాట్లాడారు? వారెవరు? అంతా సెల్‌ఫోన్‌ డేటాతో బయటకు వస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.  ఇదే పనిలో సిట్‌ చేస్తోందన్నారు.. దోషులు ఎవరైనా  కఠిన చర్యలు ఉంటాయని  అని ప్రద్యుమ్న హెచ్చరించారు. 

జూనియర్‌ వైద్యురాలు శిల్ప ఆత్మహత్య ఘటనలో తామెవరినీ టార్గెట్‌ చేయడంలేదని కలెక్టర్‌, రుయాస్పత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ ప్రద్యుమ్న తెలిపారు. ఏప్రిల్‌లో గవర్నర్‌కు శిల్ప ఫిర్యాదు చేయడం.ఆమె ఆత్మహత్య.. మృతురాలి కుటుంబీకులు, జూడాలు, ప్రభుత్వ వైద్యుల ఆందోళన నేపథ్యంలో వారి డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు సిట్‌ విచారణకు సీఎం ఆదేశించారన్నారు.
 
శిల్ప ఆత్మహత్యకు సంబంధించి డాక్టర్‌ రవికుమార్‌ను సస్పెండు చేయగా, మరో ఇద్దరు వైద్యులను బదిలీ చేశామన్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సిట్‌ విచారణలోని నిందితులను కఠినంగా శిక్షిం చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సిట్‌ విచారణకు జూనియర్‌.. ప్రభుత్వ వైద్యు లు సహకరించాలని కోరారు. 
 
ఈ వార్తలు చదవండి

డాక్టర్ శిల్ప సూసైడ్: బాబుకు చిత్తూరు కలెక్టర్ నివేదిక

డాక్టర్ శిల్ప సూసైడ్: షాకింగ్ విషయాలను బయటపెట్టిన పేరేంట్స్

డాక్టర్ శిల్ప సూసైడ్: అట్టుడుకుతున్న ఎస్వీ మెడికల్ కాలేజీ

డాక్టర్ శిల్ప సూసైడ్: 'ఆ నివేదిక ఆలస్యానికి బాధ్యులపై చర్యలకు డిమాండ్'

డాక్టర్ శిల్ప సూసైడ్: సీఐడీ విచారణ షురూ, కొనసాగుతున్న ఆందోళన

డాక్టర్ శిల్ప ఆత్మహత్య: ఆ నివేదికలో ఏముంది?

డాక్టర్ శిల్ప సూసైడ్: డాక్టర్ రవికుమార్‌పై వేటు, మరో ఇద్దరిపై చర్యలకు డిమాండ్

డాక్టర్ శిల్ప సూసైడ్: ఆ నివేదిక ఏమైంది, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

డ్యూటీకి రావాలంటే భయంగా ఉంది: ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిల్ప

click me!