‘‘కుల వనభోజనాలకు’’ నన్ను..జనసేనను దూరంగా ఉంచండి: పవన్

sivanagaprasad kodati |  
Published : Nov 12, 2018, 10:18 AM IST
‘‘కుల వనభోజనాలకు’’ నన్ను..జనసేనను దూరంగా ఉంచండి: పవన్

సారాంశం

కార్తీకమాసంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు నలుగురిని ఒక చోటికి చేర్చేందుకు పెద్దలు ఏర్పరచిన వనభోజనాలు..రాను రాను కుల వనభోజనాలుగా రూపాంతరం చెందాయి. ఇలాంటి వాటికి జనసేన పార్టీతో పాటు తనను దూరంగా ఉంచాలంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు

కార్తీకమాసంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు నలుగురిని ఒక చోటికి చేర్చేందుకు పెద్దలు ఏర్పరచిన వనభోజనాలు..రాను రాను కుల వనభోజనాలుగా రూపాంతరం చెందాయి. అక్కడ కుల సంఘాల చర్చలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఆయా కులసంఘాల మద్ధతు కోసం ఈ వనభోజనాలను స్పాన్సర్ చేస్తున్నాయి.

అయితే ఇలాంటి వాటికి జనసేన పార్టీతో పాటు తనను దూరంగా ఉంచాలంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా ఇవాళ ఉదయం ట్వీట్ చేసిన ఆయన..

"జనసేన నాయకులందరికీ విన్నపం: కార్తీక మాసం వనభోజనాలు మీరు కావాలంటే వ్యకిగతంగా జరుపుకోండి. కానీ, నా పేరు మీద కానీ, జనసేన పార్టీ పేరు మీద కానీ జరపద్దని నా మనవి" అని ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఆపై "ఆడపడుచులకు, అక్కచెల్లెళ్లకు, తల్లులకు.. కార్తీకమాసం శుభాకాంక్షలు" అంటూ పవన్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. 

 

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ మధ్య సీక్రెట్ భేటీ 

అందుకు సిద్ధపడ్తా, సినిమాల్లో వంద కోట్లు సంపాదిస్తే...: పవన్ కల్యాణ్

కాంగ్రెస్ తో చంద్రబాబు: జగన్ కు నష్టం, పవన్ కల్యాణ్ కు జోష్

తెలంగాణలో జనసేన పొత్తులు: తేల్చేసిన పవన్ కల్యాణ్

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

పవన్ కల్యాణ్ ప్లాన్ ఇదీ: మాయావతితో జరగని భేటీ

పవన్ కల్యాణ్ కు కేటీఆర్ ఫోన్: చంద్రబాబుపై కోపంతోనే...

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

తెలంగాణలో 24 సీట్లకు పోటీ చేద్దామని అనుకున్నా: పవన్ కల్యాణ్

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్