ఉత్తరాంధ్ర దోపిడీ, విమ్స్ ప్రైవేటీకరణ: పవన్ కల్యాణ్

First Published Jun 30, 2018, 7:48 AM IST
Highlights

ఉత్తరాంధ్ర దోపిడీలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం విమ్స్ ని ప్రైవేటీకరించడానికి సిద్ధపడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర దోపిడీలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం విమ్స్ ని ప్రైవేటీకరించడానికి సిద్ధపడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో తన వ్యాఖ్యను పోస్టు చేశారు. 

బొగ్గు, జబ్బులు మాకా?? డబ్బులు వారికా??  అని విశాఖ జిల్లా పోర్ట్ కాలుష్య బాధితులు నన్ను అడిగారని పవన్ కల్యాణ్ మరో పోస్టు పెట్టారు. 

ఏజన్సీ ఏరియాలోకి ఆంత్రాక్స్ ను దిగుమతి చేసింది ఎవరని ఆయన ఇటీవల మరో పోస్టును ట్విట్టర్ లో పెట్టారు. ఈ దిశలో ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయించగలదా అని ప్రశ్నించారు. 

గిరిజన సంక్షేమం విషయంలో ఐటిడిఎ ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అడిగారు. గిరిజన ప్రాంతాల్లోనే ఆంత్రాక్స్ ఎందుకు విజృంభిస్తోందని అడిగారు. ఏ విధమైన ప్రయోజనం చేకూర్చకుండా గిరిజనుల జీవితాలను దుర్భరం చేసి, వారి భయపెట్టి తరిమేసి బాక్సైట్ తవ్వకాలను, ఇతర వనరులను దోచుకోవడానికి ఆంత్రాక్స్ ను ప్రవేశపెట్టారా అని అడిగారు. ఉత్తరాంధ్రలోని వర్యావరణాన్ని, స్థానిక సంస్కృతిని ధ్వంసం చేయడం ద్వారా ఆ పనిచేయదలుచుకున్నారా అని అడిగారు. 

click me!