మోడీ అంటే నాకేం భయం.. సొంత అన్నయ్యనే ఎదిరించా: పవన్

By sivanagaprasad kodatiFirst Published Nov 5, 2018, 12:32 PM IST
Highlights

ప్రధాని నరేంద్రమోడీ అంటే జగన్, చంద్రబాబులకు భయం కానీ.. నాకేం భయమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం జగ్గంపేటలో జరిగిన ప్రజాపోరాట యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ప్రధాని నరేంద్రమోడీ అంటే జగన్, చంద్రబాబులకు భయం కానీ.. నాకేం భయమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం జగ్గంపేటలో జరిగిన ప్రజాపోరాట యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు..

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో అవినీతిమయమైన, అధర్మమైన పాలన చేస్తున్న ముఖ్యమంత్రికి జనసేన అండగా నిలబడదని.. తమ పార్టీ ఎప్పుడు ధర్మం వైపే నిలబడుతుందన్నారు. 2019లోనూ మీరే రావాలి అంటూ చంద్రబాబు కోసం హోర్డింగులు పెడుతున్నారు.. ఎందుకు రావాలి.. మరింత అవినీతి చేసేందుకా అని పవన్ ప్రశ్రించారు.

ఏపీకి కాంగ్రెస్, బీజేపీలు కలిసే అన్యాయం చేశాయి. 1997లో కాకినాడలోనే బీజేపీవాళ్లు ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అనే తీర్మానం చేశారు. ఆ రోజే మన నాయకులు సిగ్గుపడాల్సింది.. నాకు బీజేపీ అంటే చాలా కోపం, విసుగ్గా ఉందని పవన్ అన్నారు..

ప్రజలు బలమైన మార్పు కోరుకుంటున్నారని.. ఇక చంద్రబాబు రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు పవన్. విభజన సమయంలో టీడీపీ ఎంపీలను ఉత్తరాదికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు రక్తం వచ్చేలా కొట్టారు... వారిని కొట్టారనే తెలియగానే నాకే కోపం వచ్చింది..

టీడీపీకి పౌరుషం లేదని అందుకే అదే కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకున్నారని జనసేనాని దుయ్యబట్టారు. ఐటీ దాడుల చేస్తే ముఖ్యమంత్రి భయపడుతున్నారు... పారిశ్రామికవేత్తలు భయపడాల్సింది పోయి సీఎం ఎందుకు భయపడుతున్నారని పవన్ ప్రశ్నించారు.

చెప్పుకోలేని రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. వంతాడలో అడ్డగోలుగా లాటరైట్ ఖనిజాన్ని తవ్వేస్తున్నారు.. రూ.3 వేల కోట్లు విలువైన ఖనిజాన్ని అక్రమంగా తరలించి రాష్ట్ర ఖజనాకు నష్టం కలిగించారని పవన్ ఆరోపించారు. జనసేన అధికారంలోకి వచ్చాకా బాధ్యతతో కూడిన మైనింగ్ విధానాన్ని తీసుకొస్తామన్నారు.

అందుకు సిద్ధపడ్తా, సినిమాల్లో వంద కోట్లు సంపాదిస్తే...: పవన్ కల్యాణ్

కాంగ్రెస్ తో చంద్రబాబు: జగన్ కు నష్టం, పవన్ కల్యాణ్ కు జోష్

తెలంగాణలో జనసేన పొత్తులు: తేల్చేసిన పవన్ కల్యాణ్

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

పవన్ కల్యాణ్ ప్లాన్ ఇదీ: మాయావతితో జరగని భేటీ

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ కు కేటీఆర్ ఫోన్: చంద్రబాబుపై కోపంతోనే...

పవన్ కల్యాణ్ పై ఒత్తిడి: తెలంగాణలో 40 సీట్లపై గురి
 

click me!