జ్యోతుల నెహ్రూకి జగన్ చెక్.. వైసీపీలోకి కీలకనేత

By ramya neerukondaFirst Published Nov 5, 2018, 11:48 AM IST
Highlights

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్.. మాష్టర్ ప్లాన్ వేశారు.

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్.. మాష్టర్ ప్లాన్ వేశారు. గత ఎన్నికల్లో వైసీపీ జెండాతో గెలిచిన జ్యోతుల.. ఆ తర్వాత.. అధికార టీడీపీ పార్టీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. త్వరలో ఏపీలో రానున్న ఎన్నికల్లోనూ..జగ్గంపేట నియోజకవర్గ టికెట్ టీడీపీ తరపున జ్యోతులకే దక్కే అవకాశం ఉంది.

అయితే.. తమ పార్టీ గుర్తపై గెలిచి.. తర్వాత అధికార పార్టీలోకి జంప్ చేసిన నేతలపై జగన్  స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫిరాయింపు నేతలను ఓడించాలనే కసితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జ్యోతుల నెహ్రూని ఢీకొట్టే వ్యక్తిని పార్టీలోకి చేర్చుకున్నారు.

రాష్ట్రవిభజన జరగకముందు మంత్రిగా వ్యవహరించిన తోట రామస్వామి  మనవడు రామస్వామిని వైసీపీలోకి ఆహ్వానించారు. అతనిని జ్యోతులకు పోటీగా వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. తోట రామస్వామి కిర్లంపూడి మండలానికి చెందిన వ్యక్తి కాగా.. ఆయన తాత రామస్వామికి అక్కడ మంచి పేరు ఉంది. వారి కుటంబానికి బలం కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం పోరు రసవత్తరంగా మారింది. 
 

click me!