ఆ విషయంపై రోజాకి సూటి ప్రశ్న.. సమాధానం దాటివేసిన ఎమ్మెల్యే

By ramya neerukondaFirst Published Nov 5, 2018, 12:04 PM IST
Highlights

ఈ విలేకరుల సమావేశంలో ఆమెకు ఓ విలేకరి నుంచి ఎదురైన ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు.

కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం దిగజారుడుతనమేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఆదివారం ఆమె కుటుంబసమేతంగా చిత్తూరు జిల్లాలోని పేటీఎం మండలంలోని మడుమూరు పంచాయతీ మిట్టసాని పల్లెలో జరిగిన ఓ కార్యక్రమానికి  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.

కాగా... ఈ విలేకరుల సమావేశంలో ఆమెకు ఓ విలేకరి నుంచి ఎదురైన ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు.  2019 ఎన్నికల్లో వైసీపీ కేంద్రంలో ఏ పార్టీ కూటమికి మద్దతు ఇస్తుందన్న ప్రశ్నకు ఎమ్మెల్యే రోజా కాస్త తడపడ్డారు. అనంతరం సీట్లు గెలుచుకుంటే కేంద్ర పార్టీలే తమ వద్దకు వస్తాయంటూ తెలివిగా సమాధానాన్ని దాటవేశారు.

రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేయాలని ఇన్నాళ్లు ప్రగల్భాలు పలికిన చంద్ర బాబు అదే కాంగ్రెస్‌తో ఏ ముఖం పెట్టుకుని కలుస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ 10, 15 సీట్లు కోసం చంద్రబాబును దగ్గరకు తీసుకుంటోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే 5, 6శాతం ఓట్ల కోసం రాహుల్‌గాంధీ వద్ద బాబు మోకరిల్లారని విమర్శించారు. అవకాశాన్ని బట్టి రంగులు మార్చుకుంటూపోయిన చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని ధ్వజమెత్తారు
 

click me!