వెలుగు వాట్సాప్ గ్రూప్ లో.. పోర్న్ వీడియో కలకలం..!

By telugu news teamFirst Published Aug 13, 2021, 8:45 AM IST
Highlights

పొరపాటున అభ్యంతరకర వీడియో గ్రూపులో పంపినట్లు పేర్కొంటూ సదరు వెలుగు అధికారి .. మిగిలిన గ్రూప్ లోని సభ్యులందరికీ క్షమాపణలు  చెప్పడం గమనార్హం. 

స్వయం సహాయక సంఘాలకు సమాచారాన్ని అందించే గ్రామ సమాఖ్యల పర్యవేక్షకులు( వెలుగు) వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ వీడియో కలకలం రేపింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

వెలుగు గ్రూప్ కి చెందిన మహిళలంతా కలిసి  ఓ వాట్సాప్  గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ గ్రూప్ లో మొత్తం మహిళలే ఉన్నారు. వారు తమ విధులకు అవసరమైన సమాచారాన్ని ఆ గ్రూప్ లో షేర్ చేసుకునేవారు. కాగా..  బుధవారం రాత్రి ఆ గ్రూప్ లో అసభ్యకరమైన ఓ పోర్న్ వీడియో ప్రత్యక్షమైంది. దీంతో.. ఆ వీడియో చూసి అందరూ షాకయ్యారు.

పొరపాటున అభ్యంతరకర వీడియో గ్రూపులో పంపినట్లు పేర్కొంటూ సదరు వెలుగు అధికారి .. మిగిలిన గ్రూప్ లోని సభ్యులందరికీ క్షమాపణలు  చెప్పడం గమనార్హం. ఈ విషయంపై ఏపీఎం బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాత్రి అత్యవసర సమాచారాన్ని గ్రూప్ సమాఖ్యలకు పంపుతున్న క్రమంలో.. తనకు ఎవరో పంపిన వీడియో పొరపాటున సంఘాల గ్రూపులోకి చేరిందన్నారు.

వారికి తాను నేరుగా క్షమాపణ సైతం చెప్పినట్లు ఆయన చెప్పారు. తాను కావాలని చేసిన తప్పు కాదని.. పొరపాటుగా జరిగిందన్నారు. అయినప్పటికీ కొందరు ఈ వీడియోను ఇతరులకు షేర్ చేసి తన పరువు తీస్తున్నారని ఆయన వాపోవడం గమనార్హం. 

click me!