విశాఖ 'మెరీనా బీచ్' అవుతుందని భయమా!

First Published Jan 25, 2017, 2:49 AM IST
Highlights

జల్లికట్టు ప్రేరణ అయినా వైజాగ్ బీచ్ నిరసన సమీకరణ జరిగిన  తీరు 2011 ఈజిప్టు రెవల్యూషన్ ను గుర్తుచేస్తుంది.

జల్లికట్టు స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ లో చొరబడకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం విసిరింది. జల్లికట్టు ప్రేరణతో తెలుగులు యువకులు వైజాగో బీచ్ లో , “మెరీనా బీచ్” నిరసన పున:సృష్టించేందుకు చేసిన తొలి ప్రయత్నాన్ని  రాష్ట్ర ప్రభుత్వం మొగ్గలోనే తుంచేసింది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ యువత తలపెట్టిన శాంతియుత నిరసన అది. ఎవరు ఎలా మొదలుపెట్టారో తెలియదు. యువకులందరికి సోషల్ మీడియా నుంచి  పిలుపు అందింది. అది వూపందుకుంది.  

 

జల్లికట్టు ప్రేరణ అయినా, ఈ వ్యవహారం జరిగిన  తీరు 2011 ఈజిప్టు రెవల్యూషన్  ను గుర్తుచేస్తుంది.

 

ఈజిప్టు రెవల్యూషన్ జనవరి 25న  మొదలయింది. వైజాగ్ తేదీ జనవరి 26, స్థలం బీచ్.. ఈజిప్టులో  ‘పోలీస్ డే’ సందర్భంగా ఈ  యువకుల సమీకరణ జరిగింది. ఇక్కడ రిపబ్లిక్ డే. ఈజిప్టులో క్యాంపెయిన్ సోషల్ మిడియా గ్రూపులే నిర్వహించాయి. వైజాగ్ విషయంలో అదే జరిగింది. అక్కడ హోస్నీ ముబారక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం వస్తే, ఇక్కడి నినాదం  ప్రత్యేక హోదా. వైజాగ్ పోస్టర్లు కూడా ఎవరెవరో రూపొందించి ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లలో అచ్చేశారు. మరెవరో అందరికీ చేశారు. ఇలా చేతులు మారి మారి అదొక మహా సమీకరణ అయికూర్చుంది.

 

వైజాగ్ బీచ్ నిరసన కు ఎవరు కారకులో గాని, అటూ వైసిపినేత జగన్మోహన్ రెడ్డి, ఇటు పవన్ కూడా వీటికి మద్దతు తెలిపారు. ఈ బీచ్ లో నిరసన లయబద్ధంగా ఉండేందుకు జనసేన నాయకుడు ‘ నిరసన సంగీతం’ కూడా తయారు చేశారు. ఆయన బీచ్ లో ఉన్నవారందరి చేత భారత మాతాకు జై , అంటు ఉత్తరాదికి వ్యతిరేకంగా, కేంద్రానికి వ్యతిరేకంగా పిచ్చిగా నినాదాలు చేయించే  ప్రమాదం ఉంది.

 

 వైజాగ్ తరహాలో రాష్ట్రంలో  పలుచోట్ల ఇలాంటి జలికట్టు నిరసనలకు పిలుపు నిచ్చారు. జల్లికట్టు ఆవేశంలో తెలుగువారిలో ఎందుకు లేకుండా పోయిందనే పదునైన ప్ర శ్న సోషల్ మీడియా లో మొదలయింది. ఇది తెలుగువాళ్లందరికి గుచ్చుకున్నట్లే  ఉంది.

 

ఈ మధ్య కాలంలో జర్నలిజం లో ప్రతిపక్ష పాత్ర సోషల్ మీడియా పోషిస్తూ ఉంది.  మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం వేయాల్సిన ప్రశ్నలను, లెవనెత్తాల్సిన అంశాలను, బట్టబయలు చేయాల్సిన విషయాలను సోషల్  చేస్తూ ఉంది. మెయిన్ స్ట్రీమ్ మిడియా ప్రచారం సాధనంగా మారిపోతే, నిరసన గొంతులన్నీ సోషల్ మిడియా అండచేరాయి.

 

మెయిన్ స్ట్రీమ్ పత్రికలలో అంగుళం స్థలం కూడా పొందలేని ఇల్లాళ్లు, అమ్మాయిలు, వయోవృద్ధలు, యువకులు, నిరుద్యోగులు ఒక రేమిటి ఎవరయినా నిరసన వ్యక్తం చేసే  అవకాశం దొరికింది. ఇంతవరకు మేధావులకు పరిమితమయిన భా వ్యవ్యక్తీకరణ ఇపుడు ఎవరికైనా లభిస్తుంది.  ప్రతిఒక్కరు ఒక నిరసన  సైన్యంలో సభ్యులవుతున్నారు.

 

రెండురోజుల కిందట ఒక తెలుగు ఇల్లాలు 50,000 మంది ఫేస్ బుక్ అనుచరులను సంపాదించి రికార్డు సృష్టించి పండగ చేసుకున్నారు. అమెకు ఎన్ని అభినందనలు? అమె ఎమ్మాట్లాడినా 50 వేల మందికి వినబడుతుంది. కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసే భారీ బహరింగ సభతో ఇది సమానం. ఇలాంటి చోట్ల  జల్లికట్టు నిరసన చర్చనీయాంశమయింది. అది ప్రత్యేక హోదా డిమాండ్ కు ప్రాణం పోసింది.

 

  ఆంధ్ర తెలంగాణా  ప్రభుత్వాలు సోషల్ మీడియా ప్రశ్నలకు వివరణాలు కూడా ఇవ్వాల్సి వస్తున్నది. అపుడపుడు బెదిరిస్తున్నారు. అదృష్ట వశాత్తు సోషల్ మీడియా  తెలుగు ప్రభుత్వాల చేతుల్లో లేవు కాబట్టి సరిపోయింది, లేకపోతే, ఈ పాటికి ఫేస్ బుక్ అడ్మిన్ లందరిని అరెస్టు చేసి పడే సి ఉండేవారు.

 

వైజాగ్ బీచ్ నిరసనపై విరుచుకుపడిన తీరు ను చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం జల్లికట్టును చూస్తే ఎంత బెదిరిపోయిందో అర్థమవుతుంది. జల్లికట్టుకు ఆవేశం ఆంధ్రలోకి ప్రవహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయనకు తెలుసు.  

 

ప్రత్యేక హోదా జల్లికట్టులా అంటుకునే ప్రమాదం ఉందని ఆయన గ్రహించాడు. కోట్లు ఖర్చు పెట్టినా అమరావతి అంధ్రులలో తీసుకురాలేక పోయిన ఆవేశం ఈ పనికిమాలిన జల్లికట్టు ప్రత్యేక హోదా విషయంలోతీసుకురావడంతో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినట్లున్నాయి. అమరావతి మహనగరానికి లేని శక్తి జల్లికట్టున్నట్లుంది. అంతే,  వైజాగ్ బీచ్ నిరసనకు అనుమతి లేదని ప్రకటించేశారు. కారణం, సోషల్ మీడియా. సోషల్ మీడియా  ఉద్యమాలకు అనుమతించేది లేదని డిజిపి ప్రకటించారు. సోషల్ మీడియా  అంటే వణకు మొదలయింది. గతవారం ముఖ్యమంత్రి   దావోస్ లోగుట్టు బయటపెట్టింది సోషల్ మీడియాయ. ఇపుడిది.

click me!