కొత్త పార్టీ కాదు.. లోక్‌సత్తా అధినేతగా జేడీ లక్ష్మీనారాయణ..?

By sivanagaprasad kodatiFirst Published Nov 26, 2018, 8:31 AM IST
Highlights

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ రంగ ప్రవేశంపై రోజుకొక వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఆయన కొత్త పార్టీని ప్రకటిస్తున్నారని.. 26న దీనికి సంబంధించిన జెండా, అజెండా వెల్లడిస్తారని ప్రచారం జరిగింది. 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ రంగ ప్రవేశంపై రోజుకొక వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఆయన కొత్త పార్టీని ప్రకటిస్తున్నారని.. 26న దీనికి సంబంధించిన జెండా, అజెండా వెల్లడిస్తారని ప్రచారం జరిగింది.

తాజాగా లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకుని పాత పార్టీకే కొత్త అధ్యక్షుడు అవుతాడని వార్తలు వనిపిస్తున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన లోక్‌సత్తా సారథ్య బాధ్యతలను లక్ష్మీనారాయణ తీసుకుంటారని తెలిసింది.  హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఇవాళ జరిగే సమావేశంలో దీనికి సంబంధించి అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న లక్ష్మీనారాయణ డిప్యూటేషన్‌పై సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి.. సత్యం కంప్యూటర్స్, జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కేసులను డీల్ చేసి సంచలనం సృష్టించారు.

ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసి నిజాయితీ గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. డిప్యూటేషన్ కాలం పూర్తికావడంతో ఆయన తిరిగి మహారాష్ట్ర వెళ్లిపోయారు. అయితే ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు.

అప్పటి నుంచి ఏపీలో విద్యార్ధులు, రైతులు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆయన ‘‘జనధ్వని’’ పేరుతో కొత్త పార్టీని ప్రకటిస్తున్నారని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కొత్త పార్టీ పెట్టకుండా.. లోక్‌సత్తాలో సారథ్య బాధ్యతలు స్వీకరిస్తారంటూ వార్తలు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. 

రాజకీయాల్లోకి జేడీ లక్ష్మీనారాయణ...26న పార్టీ ప్రకటన

కేసీఆర్ పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం

జనసేనలోకి జేడీ లక్ష్మీనారాయణ .. ఆగస్ట్ 14న ముహూర్తం ?

లక్ష్మీనారాయణ కొత్త పార్టీ: ‘‘జేడీ’’ కలిసొచ్చేలా.. పార్టీ పేరులోనూ ‘‘జేడీ’’

రావాలనుకుంటే కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా: సీబీఐ మాజీ జేడీ

వైఎస్ భారతిపై కేసు మీద మాజీ జేడీ లక్ష్మినారాయణ స్పందన ఇదీ

click me!