ఈడీ సోదాలపై న్యాయ పోరాటం: సుజనా చౌదరి

By narsimha lodeFirst Published Nov 25, 2018, 7:54 PM IST
Highlights

తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు.

దరాబాద్:తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఈడీ సోదాలపై న్యాయపరంగా చర్యలు తీసుకొంటానన్నారు. ఈ విషయమై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్టు చెప్పారు.

రెండు రోజుల పాటు సుజనా గ్రూప్ కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన హాజరుకావాలని ఈడీ అధికారులు సుజనాకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఆదివారం నాడు సుజనా చౌదరి ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. తనకు విలువైన కార్లు, భవనాలు ఏవీ కూడ లేవని ఆయన చెప్పారు. హైద్రాబాద్ నాగార్జున హిల్స్ లో ఉన్న భవనంతో తనకు సంబంధం లేదన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కేంద్రం దాడులు చేయిస్తోందని సుజనా ఆరోపించారు.ఢిల్లీలో ఉన్న తన కారు విలువ కేవలం రూ. 3 లక్షలు మాత్రమేనన్నారు.

కంపెనీల్లో తాను ఎలాంటి ఫోర్జరీలకు పాల్పడలేదని సుజనా వివరణ ఇచ్చారు. గత 29 ఏళ్లుగా తాను ఆదాయ పన్ను కడుతున్నట్టు సుజనా స్పష్టం చేశారు.

బ్యాంకులు ఉన్నవే అప్పులు ఇవ్వడానికని సుజనా చెప్పారు. తన కంపెనీలో లావాదేవీలు పారదర్శకంగా జరిగాయని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కంపెనీలోని ఎగ్జిక్యూటివ్ పదవుల నుండి తప్పుకొన్నట్టు సుజనా తెలిపారు.

2010 తర్వాత తాను ఏనాడూ కూడ తమ కంపెనీ కార్యాలయాలకు వెళ్లలేదని సుజనా వివరణ ఇచ్చారు.120 కంపెనీలు ఉన్నట్టు ఈడీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్ని కంపెనీలు పెట్టకూడదనే రూల్ ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఈడీ సోదాలపై న్యాయపరంగా చర్యలు తీసుకొంటానన్నారు. ఈ విషయమై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు సుజనా తెలిపారు.ఈడీ సోదాలు తొందరపాటు చర్యగా కన్పిస్తోందన్నారు.జగన్ కేసులకు తన ఆస్తులపై సోదాలకు సంబంధం లేదని సుజనా వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

సుజనాకు ఈడీ సమన్లు: చంద్రబాబుకు పెద్ద దెబ్బ

రూ.6వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్: సుజనాచౌదరికి ఈడీ సమన్లు

టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి ఐటీ అధికారుల షాక్..

 

click me!