పవన్ కాన్వాయ్ ప్రమాదంపై జనసేన అనుమానం, విచారణకు డిమాండ్

By Nagaraju TFirst Published Nov 15, 2018, 11:57 PM IST
Highlights

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ రాజానగరం నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. అందులో భాగంగా రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు కాకినాడ నుంచి రాజానగరం బయలు దేరారు. 
 

రాజమహేంద్రవరం: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ రాజానగరం నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. అందులో భాగంగా రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు కాకినాడ నుంచి రాజానగరం బయలు దేరారు. 

అయితే రంగంపేట మండలం రామేశంపేట వద్ద పవన్ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న వాహన శ్రేణిలోని సెక్యూరిటీ వాహనాన్నిలారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది పవన్ ప్రైవేట్ భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 

క్షతగాత్రులను చికిత్సనిమిత్తం రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ముందు పవన్ కళ్యాణ్ ఉన్న వాహనం ముందు వెళ్లడంతో పవన్ కళ్యాణ్ కు ప్రమాదం గురించి తెలియలేదు. దీంంతో పవన్ రాజానగరం బహిరంగ సభలో పాల్గొన్నారు. 

గాయపడిన వారిలో శివ, నవీన్‌, పి. అరవింద్‌, కె.శ్రీకాంత్‌, జె.రామకిశోర్‌, జావీద్‌, బాబి, బి. శ్రీకాంత్‌ ఉన్నారు. క్షతగాత్రులకు ఎలాంటి ప్రాణపాయం లేకపోవడంతో జనసేన పార్టీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

అయితే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ప్రమాద ఘటనపై జనసేన పార్టీ సీరియస్ గా స్పందించింది. కాన్వాయ్ లోని ప్రైవేట్ సెక్యూరిటీ వాహనాన్ని లారీ ఢీకొట్టడంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ కు ప్రమాదం తప్పడంతోపాటు గాయాలతో ప్రైవేట్ సిబ్బంది బయటపడటం సంతోషమే అయినా ఘటనలో ఏదో కుట్ర దాగి ఉందంటూ వారు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై సీరియస్ గా విచారణ జరిపి కారణాలు తెలపాలని జనసేన లీగల్ సెల్ ప్రకటన విడుదల చేసింది. లేని పక్షంలో ఇది కుట్రగా భావిస్తామని ప్రకటనలో తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి తృటితో తప్పిన ప్రమాదం

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం

సీఎంకు సిగ్గులేదు, ప్రతిపక్షనేతకు దమ్ములేదు:పవన్ కళ్యాణ్

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

ఎన్టీఆర్ మాదిరిగా మంచోడిని కాను: బాబుపై పవన్ నిప్పులు

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

ఓట్ల కోసం కాదు..సాయం చేసేందుకే వచ్చా: శ్రీకాకుళంలో పవన్

 

click me!