అవినీతి రాజకీయ నేతలను తన్ని తరిమేద్దాం: పవన్ కళ్యాణ్

Published : Nov 15, 2018, 07:53 PM IST
అవినీతి రాజకీయ నేతలను తన్ని తరిమేద్దాం: పవన్ కళ్యాణ్

సారాంశం

అధికార ప్రతిపక్ష పార్టీలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుపులను నడిపించేది చంద్రబాబు, జగన్ లోకేష్ లేనని ఆరోపించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పర్యటిస్తున్న పవన్ అవినీతిని పారద్రోలి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

రాజానగరం: అధికార ప్రతిపక్ష పార్టీలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుపులను నడిపించేది చంద్రబాబు, జగన్ లోకేష్ లేనని ఆరోపించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పర్యటిస్తున్న పవన్ అవినీతిని పారద్రోలి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

బోఫోర్సు లాంటి కుంభకోణాలు, ప్రస్తుతం నియోజకవర్గం స్థాయిలోనే జరుగుతున్నాయని పవన్ ఆరోపించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రారంభించిన టీడీపీని, సీఎం చంద్రబాబు కాంగ్రెస్ నేతల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు పౌరుషం లేదని ఎద్దేవా చేశారు. 

జనసేన లేకుండా చంద్రబాబు సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు పవన్. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీలో ప్రజాసమస్యలపై నిలదీయాలని డిమాండ్ చేశారు. అవినీతి రాజకీయ నాయకులను తన్ని తరిమేద్దామని పవన్  పిలుపునిచ్చారు. 

విద్యాసంస్థలను మంత్రి నారాయణకు ఇచ్చేస్తారని, మద్యం షాపులను మాత్రం చంద్రబాబు, జగన్, లోకేష్ నడుపుతారని దుయ్యబట్టారు. బైబిల్ పట్టుకుని తిరిగే జగన్ మద్య నిషేధంపై ఎందుకు మాట్లాడరని పవన్‌ నిలదీశారు.

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం

సీఎంకు సిగ్గులేదు, ప్రతిపక్షనేతకు దమ్ములేదు:పవన్ కళ్యాణ్

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే