చంద్రబాబు కొలువులో అఖిలప్రియ కన్నా చిన్న మంత్రి

By sivanagaprasad kodatiFirst Published Nov 10, 2018, 1:40 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం భూమా అఖిలప్రియ. అయితే ఇప్పుడు ఈ ప్లేస్‌ను దక్కించుకోబోతున్నాడు దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కుమార్. 
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం భూమా అఖిలప్రియ. అయితే ఇప్పుడు ఈ ప్లేస్‌ను దక్కించుకోబోతున్నాడు దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కుమార్. 

కేబినెట్‌లో మైనార్టీలు లేని లోటును పూడ్చటంతో పాటు .. ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను చంద్రబాబు భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా గిరిజనులకు మంత్రిమండలిలో చోటు కల్పించడంతో పాటు మావోయిస్టుల చేతిలో దారుణహత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు కుటుంబానికి న్యాయం చేసినట్లు ఉంటుందనే భావనతో.. కిడారి పెద్ద కొడుకును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. 

కిడారి హత్య తరువాత ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు.. శ్రావణ్ కుమార్‌ రాజకీయంగా ఎదగడానికి అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేబినెట్‌లోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. 

ఇక శ్రావణ్ విషయానికి వస్తే... 1990 జూన్ 14వ తేదీన జన్మించిన ఆయన ఒకటి నుంచి 8వ తరగతి వరకు పెదబయలు సెయింట్ ఆన్స్ స్కూల్‌లో.. 9, 10 తరగతులు పార్వతీపురంలోని స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చదివారు.. ఇంటర్మీడియట్‌ను విశాఖలోని నారాయణ కాలేజీలో అభ్యసించారు.. వారణాసి ఐఐటీలో మెటలార్జీ చేశారు.. 

సివిల్స్‌ కలను నెరవేర్చుకునేందుకు ఢిల్లీలో శిక్షణ పొందుతుండగా మావోల చేతిలో తండ్రి హత్యకు గురైయ్యారని తెలియడంతో.. అప్పటి నుంచి పాడేరులోనే ఉంటూ.. కుటుంబానికి, అనుచరులకు పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. 

శ్రావణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. అఖిలకన్నా పిన్న వయస్కుడైన మినిస్టర్‌గా రికార్డులకు ఎక్కుతారు. భూమా అఖిలప్రియ 1989లో జన్మించగా.. శ్రావణ్ 1990లో పుట్టారు. కిడారి కొడుకును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో మన్యంలో అనుచరులు, టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

కేబినెట్ విస్తరణలో భాగంగా రాయలసీమకు చెందిన సీనియర్ నేత ఫరూఖ్, కిడారి శ్రావణ్ కుమార్‌లు.. ఆదివారం ఉదయం 11.45 గంటలకు ఉండవల్లిలో ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం..

బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ మధ్య సీక్రెట్ భేటీ

కాంగ్రెస్ కి షాక్... నాదెండ్ల బాటలో పసుపులేటి

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

కంట్లో కారం చల్లి.. కత్తులతో వెంటాడి టీడీపీ నేత దారుణహత్య

వైసీపీకి సీనియర్ నేత రాజీనామా.. వెంటనే యూటర్న్

చంద్రబాబుతో దోస్తీపై గుర్రు: కాంగ్రెసుకు చిరంజీవి రాంరాం

నాకు మంత్రి పదవి కావాలి.. ఎమ్మెల్యే చాంద్ బాషా

click me!