జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Nov 6, 2018, 1:56 PM IST
Highlights

 వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి ఘటన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై, టీడీపీపై వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే   జోగి రమేష్‌‌‌ను  గుంటూరు పోలీసులు విచారిస్తున్నారు. 

గుంటూరు: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి ఘటన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై, టీడీపీపై వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే   జోగి రమేష్‌‌‌ను  గుంటూరు పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా గుంటూరు అరండల్ పేట ‌ పోలీస్ స్టేషన్ వద్దకు  టీడీపీ, వైసీపీ  కార్యకర్తలు  పోటా పోటీగా చేరుకొంటుండడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

విశాఖ  ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై  శ్రీనివాసరావు ఈ ఏడాది అక్టోబర్ 25 వ తేదీ  కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి ఘటన తర్వాత  శ్రీనివాసరావు వైసీపీ కార్యకర్త అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయాన్ని  తాను చెప్పానని  జోగి రమేష్  మంగళవారం నాడు మీడియాకు చెప్పారు. ఈ విషయం చెప్పినందుకే తనకు నోటీసులు ఇచ్చి  పోలీసులు విచారణకు పిలిచారని ఆయన చెప్పారు.

జగన్‌పై హత్యాయత్నం కేసును నీరుగార్చేందుకు టీడీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని జోగి రమేష్ ఆరోపించారు. జగన్‌ను ముక్కలు.. ముక్కలుగా చేస్తామన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటిస్తే ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. మరో వైపు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై  పోలీసులు, టీడీపీ సర్కార్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

గుంటూరులోని అరండల్ పేట పోలీస్‌స్టేషన్‌ వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకొన్నారు. అయితే శ్రీనివాసరావుకు  ఫేక్ఐడీ  విషయంలో కీలక పాత్ర పోషించిన జోగి రమేష్‌ను అరెస్ట్ చేయాలని  టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై టీడీపీ కార్యకర్తలు ర్యాలీకి పిలుపునిచ్చారు. రెండు పార్టీలు పోటా పోటీగా అరండల్ పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకొనేందుకు ప్రయత్నిస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత వార్తలు

జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్

జగన్ పై దాడి కేసులో ట్విస్ట్: జోగిరమేష్ కు నోటీసులు

జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

 

 

 

 

click me!