దారి తెలియని ఏపీ మంత్రి, అరగంటపాటు నగరమంతా చక్కర్లు

By Nagaraju TFirst Published Nov 6, 2018, 12:25 PM IST
Highlights

 ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ఆ మంత్రి బయలుదేరారు. అప్పటి వరకు సందర్శకులతో కార్యకర్తలతో భేటీ అయిన ఆయన ఎమ్మెల్యే ఇంటికి బయలు దేరారు. అడ్రస్ తెలియకపోవడంతో పోలీసులు కాన్వాయ్ ను అరగంట పాటు అటూ ఇటూ తిప్పారు. అరగంట పాటు నగరంలో కాన్వాయ్ చక్కర్లు కొట్టడంతో ఆ మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చింది. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
 

గుంటూరు: ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ఆ మంత్రి బయలుదేరారు. అప్పటి వరకు సందర్శకులతో కార్యకర్తలతో భేటీ అయిన ఆయన ఎమ్మెల్యే ఇంటికి బయలు దేరారు. అడ్రస్ తెలియకపోవడంతో పోలీసులు కాన్వాయ్ ను అరగంట పాటు అటూ ఇటూ తిప్పారు. అరగంట పాటు నగరంలో కాన్వాయ్ చక్కర్లు కొట్టడంతో ఆ మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చింది. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు పెదకూరపాడు ఎమ్మెల్యే శ్రీధర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు తన ఇంటి నుంచి బయలు దేరారు. అయితే శ్రీధర్ ఇంటికి దారి చూపడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అడ్రస్ తెలియక గుంటూరు అర్బన్ లోనే దాదాపు అరగంట పాటు చక్కర్లు కొట్టించారు.

 దాదాపు నాలుగైదు వీధులు తిరుగుతూనే ఉంది కాన్వాయ్. దీంతో మంత్రి నక్కా ఆనందబాబుకు చిర్రెత్తుకొచ్చింది. పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. అరగంట పాటు కాన్వాయ్ రోడ్లపై తిరుగుతున్నా స్థానిక పోలీసులు అందుబాటులో లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్రస్ తెలియదన్నప్పుడు తెలుసుకోవాలంటూ సూచించారు. ఇది కరెక్ట్ కాదంటూ సున్నితంగా మందలించారు. 

click me!