పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

By Nagaraju penumala  |  First Published Sep 16, 2019, 8:16 PM IST

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులు వల్లే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కోడెల మరణానికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. గతంలో పరిటాల రవీంద్రను భౌతికంగా హత్య చేస్తే కోడెల శివప్రసాదరావును మానసికంగా వేధించి చంపారని ఆరోపించారు. 
 


హైదరాబాద్: వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్ల తాము గొప్ప నాయకుడిని కోల్పోయామన్నారు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. కోడెల ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. 

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులు వల్లే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కోడెల మరణానికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. గతంలో పరిటాల రవీంద్రను భౌతికంగా హత్య చేస్తే కోడెల శివప్రసాదరావును మానసికంగా వేధించి చంపారని ఆరోపించారు. 

Latest Videos

కోడెలపై వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలు చేపట్టిందని ఆరోపించారు. కోడెలతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టించారని మండిపడ్డారు. కోడెల  మరణించిన తరువాత కూడా కొంతమంది మంత్రులు కేసులు పెట్టిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ఆఫీసు నుంచే కేసులు పెట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కోడెల పల్నాడులో ఎన్నో బాంబు దాడులు తట్టుకున్నారని అలాంటి వ్యక్తి ప్రభుత్వ వేధింపులను తట్టుకోలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల చనిపోయిన తర్వాత కూడా వైసీపీ మంత్రులు చేస్తున్న విమర్శలు అత్యంత దురదృష్టకరమన్నారు. 

కోడెల శివప్రసాదరావును బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లడాన్ని కూడా రాజకీయం చేస్తారా అంటూ మండిపడ్డారు. కోడెల కుటుంబ సభ్యుల ఉసురు వైసీపీ ప్రభుత్వానికి తప్పక తగులుతుందని దేవినేని ఉమా మహేశ్వరరావు శాపనార్థాలు పెట్టారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

click me!