నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

By Nagaraju penumala  |  First Published Sep 16, 2019, 7:55 PM IST

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లడమేంటని నిలదీశారు. నిమ్స్ ఆస్పత్రికో, కేర్ ఆస్పత్రికో తీసుకెళ్తారని చెప్పుకొచ్చారు. ఆత్మహత్యలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తారని అక్కడ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. 


అమరావతి: మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకీలక వ్యాఖ్యలు చేశారు. కోడెల ఆత్మహత్యపై అనేక అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లడమేంటని నిలదీశారు. నిమ్స్ ఆస్పత్రికో, కేర్ ఆస్పత్రికో తీసుకెళ్తారని చెప్పుకొచ్చారు. ఆత్మహత్యలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తారని అక్కడ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. 

Latest Videos

undefined

తెలుగుదేశం పార్టీలా తమకు శవరాజకీయాలు చేసే అలవాటు లేదన్నారు. కోడెల శివప్రసాదరావు మరణంపై ప్రముఖ న్యూస్ ఛానెల్ లో వేర్వేరు కారణాలతో కథనాలు ప్రచారం చేశాయని ఎందుకు అలా ప్రచారం చేశారో తెలియాలన్నారు. 

కోడెల మృతికి కుటుంబ విబేధాలు ఏమైనా కారణమా అన్న కోణంలో కూడా ఆలోచించాలన్నారు. కోడెల శివప్రసాదరావును వైసీపీ ప్రభుత్వం ఏనాడు వేధించలేదన్నారు. కోడెలపై కేసులు పెట్టింది సామాన్యులు మాత్రమేనని చెప్పుకొచ్చారు. 

కోడెల శివప్రసాదరావును పోలీసులు వేధించారనడంలో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. ఏనాడు కోడెల శివప్రసాదరావును పోలీసులు అరెస్ట్ చేయలేదని, స్టేషన్లో పెట్టి వేధించలేదే అని తెలిపారు బొత్ సత్యనారాయణ. 

కోడెల మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు బొత్స సత్యనారాయణ. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆత్మహత్యకు బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోందన్నారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా విచారణ చేపట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

click me!