మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

By Nagaraju penumala  |  First Published Sep 16, 2019, 7:33 PM IST

కోడెల శివప్రసాద్ ని  కేసుల పేరుతో వేధించి ఆయన బలవన్మరణానికి కారణమైనందుకు కాస్త కూడా పశ్చాత్తాపం లేకుండా, సిగ్గులేని ప్రచారాలతో రెచ్చిపోతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరసలు మనుషులేనా? మీకసలు విలువలనేవే లేవా అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. 
 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి నారా లోకేష్. కోడెల ఆత్మహత్యపై తప్పుడు ప్రచారాం చేస్తారా అంటూ తిట్టి పోశారు. శవాల మీద రాజకీయ లబ్ది కాసులు ఏరుకునే పైశాచిక చేష్టలను వైసీపీ ఎప్పటికీ మానుకోదా అంటూ నిలదీశారు. 

కోడెల శివప్రసాద్ ని  కేసుల పేరుతో వేధించి ఆయన బలవన్మరణానికి కారణమైనందుకు కాస్త కూడా పశ్చాత్తాపం లేకుండా, సిగ్గులేని ప్రచారాలతో రెచ్చిపోతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరసలు మనుషులేనా? మీకసలు విలువలనేవే లేవా అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. 

Latest Videos

కోడెలది ఆత్మహత్య కాదు. ఇది ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. దాన్ని కప్పిపుచ్చుకోడానికి కుటుంబ కలహాలు అని, కొడుకే కొట్టి చంపారని నిస్సిగ్గుగా మీ దొంగ ఛానల్ లో కథనాలు ప్రసారం చేస్తారా అంటూ నిలదీశారు. కోడెలగారి కొడుకు విదేశాల్లో ఉన్న విషయం మీ గుడ్డి సాక్షి ఛానల్ కి కనపడలేదా అంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. 

కోడెలగారిది ఆత్మహత్య కాదు. ఇది ముమ్మాటికీ వైకాపా ప్రభుత్వ హత్యే. దాన్ని కప్పిపుచ్చుకోడానికి కుటుంబ కలహాలు అని, కొడుకే కొట్టి చంపారని నిస్సిగ్గుగా మీ దొంగ ఛానల్ లో కథనాలు ప్రసారం చేస్తారా? కోడెలగారి కొడుకు విదేశాల్లో ఉన్న విషయం మీ గుడ్డి సాక్షి ఛానల్ కి కనపడలేదా? pic.twitter.com/bGL6gd78Xp

— Lokesh Nara (@naralokesh)

ఈ వార్తలు కూడా చదవండి

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

 

click me!