జగన్‌పై దాడి ఎఫెక్ట్: గవర్నర్‌ను కలవని బాబు.. ప్రమాణ స్వీకారం వరకే

sivanagaprasad kodati |  
Published : Nov 11, 2018, 12:08 PM IST
జగన్‌పై దాడి ఎఫెక్ట్: గవర్నర్‌ను కలవని బాబు.. ప్రమాణ స్వీకారం వరకే

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై దాడి జరిగిన తర్వాత గవర్నర్ వైఖరిని బహిరంగంగానే విమర్శించారు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై దాడి జరిగిన తర్వాత గవర్నర్ వైఖరిని బహిరంగంగానే విమర్శించారు చంద్రబాబు.

గవర్నర్ నేరుగా అధికారులకు ఫోన్లు చేస్తే తామంతా ఉన్నది ఎందుకు అంటూ మండిపడ్డారు. అప్పటి నుంచి నరసింహాన్‌పై అసహనంగా ఉంటున్న ఏపీ సీఎం... ఇవాళ మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడ వచ్చిన గవర్నర్‌తో అంటీముట్టునట్లుగా వ్యవహరించారు.

నరసింహాన్ ఎప్పుడు అమరావతి వచ్చినా ఆయనతో సమావేశమయ్యే ముఖ్యమంత్రి ఆయనతో భేటీకి దూరంగానే ఉన్నారు. అంతకు ముందు కేబినెట్ విస్తరణ, కొత్త మంత్రుల గురించి కూడా గవర్నర్‌తో చర్చించలేదు. సీఎంవో ద్వారానే కొత్త మంత్రుల పేర్లను రాజ్‌భవన్‌కు పంపారు. మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలోనూ ఇద్దరు ముభావంగానే కనిపించారు. 

గవర్నర్‌తో బేటీ: ఇదీ మా ప్లాన్, తేల్చేసిన బాబు

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

నేనూ తుపాకీ పట్టాల్సినవాడినే: నరసింహన్ సంచలన వ్యాఖ్యలు

ఏం జరిగింది: గవర్నర్ పై చంద్రబాబు ఆగ్రహానికి కారణం ఏమిటి?

ఇదేం పద్ధతి: గవర్నర్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

కేంద్రంపై చంద్రబాబు పోరు: మూడు రోజులు ఢిల్లీలోనే గవర్నర్

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్