జగన్ పై దాడి కేసు దర్యాప్తు: తలెత్తే ప్రశ్నలు ఇవీ...

By pratap reddyFirst Published Nov 3, 2018, 1:24 PM IST
Highlights

జగన్ దాడి కేసు మొత్తం రాజకీయ రంగును పులుముకుంది. కేసు దర్యాప్తు ప్రారంభంలోనే డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రకటన చేసి వివాదానికి మరింత ఆజ్యం పోశారు. శ్రీనివాస రావు జగన్ అభిమాని అని, ప్రచారం కోసమే ఈ దాడి చేశాడని చెప్పారు.

విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసు విచారణ ఎంత వరకు ముందుకు సాగిందనేది తెలియడం లేదు. నిందితుడు జనిపల్లి శ్రీనివాస రావును పోలీసులు విచారించారు. ఈ కేసులో పలువురిని విచారించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, కేసు దర్యాప్తు విషయంలో పలు ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. 

జగన్ దాడి కేసు మొత్తం రాజకీయ రంగును పులుముకుంది. కేసు దర్యాప్తు ప్రారంభంలోనే డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రకటన చేసి వివాదానికి మరింత ఆజ్యం పోశారు. శ్రీనివాస రావు జగన్ అభిమాని అని, ప్రచారం కోసమే ఈ దాడి చేశాడని చెప్పారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతూ వెళ్లారు. టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు మరింతగా వివాదానికి కారణమయ్యాయి.  రాజేంద్ర ప్రసాద్ వంటి టీడీపీ నాయకుల వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే తప్పు పట్టారు. 

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడానికి జగన్ నిరాకరిస్తున్నారు. మూడోసారి ఎపి పోలీసులు జగన్ ను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తనకు ఎపి పోలీసులపై నమ్మకం లేదని ఆయన చెబుతున్నారు. ఈ మొత్తం కేసు ఎటు మళ్లుతుందనే విషయం అంతు చిక్కడం లేదు. పలు ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. 

దర్యాప్తు ముగిసి కోర్టులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేస్తే గానీ అసలేమిటనేది అర్థం కాదు. అయితే, ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందా అనేది ఓ ప్రశ్న కాగా శ్రీనివాస రావుకు ప్రాణహాని ఉందా అనేది మరో కీలకమైన ప్రశ్న. ఈ కేసులో ఎంత మందిపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేస్తారనే విషయం తేలాల్సి ఉంది. శ్రీనివాస్ కు నార్కో ఎనాలిస్ టెస్టు నిర్వహించాలనే వాదన ముందుకు వస్తోంది. అయితే, అది అంత సులభం కాకపోవచ్చు. నిందితుడు అందుకు అంగీకరిస్తే తప్ప అది సాధ్యం కాదు. 

శ్రీనివాస్ రావు నుంచి స్వాధీనం చేసుకున్నామని చెబుతున్న 11 పేజీల లేఖ ద్వారా పోలీసులు తేల్చిందేమిటనేది ప్రశ్న. జీరో బ్యాలెన్స్ ఖాతాలు పథకంలో భాగమా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. అమ్మాయిలతో శ్రీనివాస రావు పదే పదే ఎందుకు మాట్లాడాడనేది తేలాల్సి ఉంది. అదే విధంగా దాడిలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న ఇద్దరు అమ్మాయిలతో శ్రీనివాస రావుకు ఉన్న సంబంధం ఏమిటనేది ముఖ్యమైన ప్రశ్నే. శ్రీనివాస రావు కాల్ డేటాలో ఎవరు పేర్లు ఉన్నాయనేది కూడా ముఖ్యమైన ప్రశ్నే. ఈ ప్రశ్నలకు అన్నింటికీ సమాధానం దొరికి జగన్ పై దాడి కేసు కొలిక్కి వస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు చదవండి

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

click me!