అప్పుడు చంద్రబాబు, చిరంజీవి.. ఇప్పుడు పవన్ సేమ్ టూసేమ్

Published : Nov 03, 2018, 12:55 PM IST
అప్పుడు చంద్రబాబు, చిరంజీవి.. ఇప్పుడు పవన్ సేమ్ టూసేమ్

సారాంశం

ఒకప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్, కాంగ్రెస్ నేత చిరంజీవి ఏదైతే చేశారో.. సేమ్ అదే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేశారు.

ఒకప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్, కాంగ్రెస్ నేత చిరంజీవి ఏదైతే చేశారో.. సేమ్ అదే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేశారు. ఇంతకీ వీరంతా చేసిన పని ఏంటో తెలుసా..? ఒకే చోట బస చేయడం.

పూర్తి మ్యాటర్ లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన పవన్.. తొలిరోజు సత్యదేవుని సన్నిధిలో బస చేశారు. తుని బహిరంగసభ ముగించుకున్న ఆయన సత్యగిరి కొండపై కేటాయించిన సీతా అతిథిగృహంలో బస చేశారు.

గతంలో రాజకీయ పర్యటనలకు వచ్చిన సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, ప్రజారాజ్యం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న చిరంజీవి.. వీరంతా సత్యగిరి కొండపై బసచేసిన వారు కావడం విశేషం

ప్రస్తుతం పవన్ కి ఎలాంటి రాజకీయ పదవి లేకపోవడంతో.. ఆయన వద్ద నుంచి నిబంధనల ప్రకారం.. బసచేసిన గదికి అద్దె స్వీకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?