మోదీ పాలన అంతం టీడీపీ పంతం:దేవినేని ఉమా

By Nagaraju TFirst Published Nov 3, 2018, 12:32 PM IST
Highlights

 ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. దేశాన్ని మోదీ నియంతలా దుష్టపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మోదీ పాలనను ప్రశ్నించకుండా చంద్రబాబుని లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని మండిపడ్డారు. 
 

అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. దేశాన్ని మోదీ నియంతలా దుష్టపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మోదీ పాలనను ప్రశ్నించకుండా చంద్రబాబుని లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని మండిపడ్డారు. 

బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకే ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, ములాయం సింగ్ లాంటి సీనియర్ నేతలతోనూ, కాంగ్రెస్‌తోనూ కలసి పనిచేసేందుకు టీడీపీ రెడీ అయ్యిందని తేల్చిచెప్పారు. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రపన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్‌తో కలిసి నడవాలని చంద్రబాబు ఓ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిందని మంత్రి దేవినేని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఈ ప్రయత్నాలకు మంచి స్పందన వస్తుంటే పవన్ తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు.  

కేంద్రం సహకరించకపోయినా పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని తెలిపారు. నిధులివ్వని కేంద్రాన్ని ప్రశ్నించకుండా బీజేపీతో పవన్, జగన్ పార్టీలు అంటకాగుతున్నాయని ఆరోపించారు. టీడీపీని దెబ్బతీయడానికే వైసీపీ, జనసేన,బీజేపీ ఏకమ్యయాయని విమర్శించారు. 

వైసీపీ,బీజేపీ, జనసేన పార్టీల కుట్రలను తాము తిప్పి కొడతామన్నారు. తెలుగుజాతి హక్కులను కాపాడుకునేందుకు టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. సముద్రంలోకి వృథాగా వెళ్లాల్సిన 246 టీఎంసీల నీటిని ఒక నదీ ప్రవాహ ప్రాంతం నుంచి మరో నదీ ప్రవాహ ప్రాంతానికి తరలించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఉమా అన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ వెనుక అదృశ్యశక్తి ఎవరో తెలుసా..

ప్రత్యేక హోదాని సినిమాతో పోల్చడం బాధాకరం.. పవన్ పై లోకేష్

నేను భయపడను తిరగబడతా, మెడలు వంచుతా: చంద్రబాబు​​​​​​​

click me!