క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

By Nagaraju penumala  |  First Published Sep 16, 2019, 6:51 PM IST

గత కొంతకాలంగా కేసులపై కేసులు పెడుతూ మానసిక క్షోభకు గురి చేశారని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో తనతో కూడా ప్రభుత్వ కక్ష సాధింపుపై మాట్లాడారని తెలిపారు. పోలీసులు సైతం ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ కేసుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తనతో కోడెల చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. 


అమరావతి : మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు వైసీపీ ప్రభుత్వ వేధింపులే కారణమని ఆరోపించారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. కోడెల శివప్రసాదరావును వైసీపీ ప్రభుత్వం మానసికంగా వేధించిందని ఆరోపించారు. 

గత కొంతకాలంగా కేసులపై కేసులు పెడుతూ మానసిక క్షోభకు గురి చేశారని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో తనతో కూడా ప్రభుత్వ కక్ష సాధింపుపై మాట్లాడారని తెలిపారు. పోలీసులు సైతం ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ కేసుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తనతో కోడెల చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. కోడెల తీరు చూసి మనోవేదనకు గురయ్యారని తాను భావించినట్లు యనమల రామకృష్ణుడు తెలిపారు. 
 
ఇకపోతే కోడెల ఆత్మహత్యపై టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్న బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డారు. మొన్నటి వరకు కోడెలపై లేని కేసులు ప్రభుత్వం మారగానే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. కోడెల డిప్రెషన్‌కు వెళ్లడానికి రాజకీయ కక్షలే కారణం కాదా అని బొత్సను ప్రశ్నించారు. 
 
కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం ఏది చెబితే పోలీసులు గుడ్డిగా అదే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల మరణానికి పోలీసులు కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  

Latest Videos

కోడెల ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు నిస్వార్థంగా విచారణ చేపట్టాలని తెలంగాణ పోలీసులను కోరారు. కేసును నిస్వార్థంగా విచారించి కారణాలను నిర్మొహమాటంగా ప్రకటించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

 

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

 

click me!