ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధినిపై రేప్: ఎవరిని వదలేది లేదన్న ఎస్పీ అమ్మిరెడ్డి

By narsimha lodeFirst Published Jun 29, 2020, 12:40 PM IST
Highlights

ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధినిపై రేప్, నగ్న దృశ్యాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన కేసులో చట్ట ప్రకారంగా వ్యవహరిస్తున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరా తీశారు. 
 


గుంటూరు: ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధినిపై రేప్, నగ్న దృశ్యాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన కేసులో చట్ట ప్రకారంగా వ్యవహరిస్తున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరా తీశారు. 

గుంటూరు జిల్లాలో విద్యార్ధినిపై అత్యాచారం కేసు విషయమై గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డితో ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గుంటూరు అర్బన్ ఎస్పీతో సమావేశమయ్యారు. ఈ కేసు వివరాలను ఆమె అడిగి తెలుసుకొన్నారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.  ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా సంస్థల్లో కూడ పోర్న్ దృశ్యాలను అప్ లోడ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 

also read:గుంటూరు స్టూడెంట్ రేప్ కేసులో ట్విస్ట్: నగ్న వీడియోలు అప్‌లోడ్‌లో యువతుల పాత్ర

ఈ విషయమై తాము ఈ రెండు సంస్థలకు కూడ లేఖ రాయనున్నట్టు ఆమె చెప్పారు. అమ్మాయిల నగ్న దృశ్యాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయకుండా టెక్నాలజీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. 

ఇంజనీరింగ్ స్టూడెంట్ నగ్న దృశ్యాలను పోర్న్ సైట్స్ లో పోస్టు చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ తెలుసుననే ఉద్దేశ్యంతో ఈ రకంగా పోర్న్ సైట్స్ లో విద్యార్ధిని దృశ్యాలను అప్ లోడ్ చేయడాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకొంటున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా , మహిళలను అసభ్యంగా చిత్రీకరించే పోస్టులపై పోలీసు శాఖ ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసిందని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధిని నగ్న దృశ్యాలు ఇద్దరు యువతులకు చేరినట్టుగా తమ విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. అయితే ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు. ఈ కేసులో సాక్ష్యాలు దొరికితే  ఎవరిని కూడ ఉపేక్షించబోమన్నారు.

ఈ కేసులో ఏ1గా ఉన్న నిందితుడు పోలీసు అధికారి కొడుకు. అయినంత మాత్రాన కేసులో అతడిని తప్పించే ప్రయత్నం చేయలేదని ఎస్పీ వివరణ ఇచ్చారు. 

ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా కూడ వారిని ఉపేక్షించబోమని ఆయన చెప్పారు. ఈ కేసులో సోషల్ మీడియాలో పోస్టు చేసిన లింకులకు సంబంధించిన ఆధారాలను కూడ సేకరిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.  ఈ కేసులో ఇద్దరు మాత్రమే ఇన్ వాల్వ్ అయినట్టుగా తేలిందన్నారు. ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనే విషయమై కూడ ఆరా తీస్తున్నామన్నారు.

click me!