Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు స్టూడెంట్ రేప్ కేసులో ట్విస్ట్: నగ్న వీడియోలు అప్‌లోడ్‌లో యువతుల పాత్ర

గుంటూరులో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధినిపై అత్యాచారంతో పాటు ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంలో ఇద్దరు యువతులు కూడ సహకరించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.

police found sensational facts in guntur engineering college student rape case
Author
Guntur, First Published Jun 28, 2020, 2:35 PM IST


గుంటూరు: గుంటూరులో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధినిపై అత్యాచారంతో పాటు ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంలో ఇద్దరు యువతులు కూడ సహకరించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయంలో వారిపై కూడ పోలీసులు కేసు నమోదు  చేసేందుకు సిద్దమౌతున్నారు.

గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్ధినిపై  ఇద్దరు సహ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. 2017  నుండి ఈ విద్యార్ధిని చిత్రాలను ఫోర్న్ సైట్ లో పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు.

తొలుత ఈ దృశ్యాలను నెట్ లో పెట్టి తాత్కాలికంగా డిలీట్ చేశారు. ఆ తర్వాత ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉందని తెలుసుకొని మరో యువకుడికి చూపించారు.  కౌశిక్, వరుణ్ తేజ్  లను పోలీసులు అరెస్ట్ చేశారు.  అయితే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తే సంచలన విషయాలు వెలుగు చూశాయి.

బాధిత యువతి నగ్న వీడియోలను వరుణ్ తేజ్  స్నేహితురాలు తీసుకొంది. ఈ వీడియోలను కౌశిక్ సోదరికి చేరింది. ఈ వీడియోలను  వరుసకు సోదరి ద్వారా పొందిన  కౌశిక్ ఫోర్న్ సైట్ లో అప్ లోడ్ చేసినట్టుగా ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. 

also read:బిటెక్ విద్యార్థినిపై సహ విద్యార్థుల అఘాయిత్యం: నెట్ లో నగ్న చిత్రాలు

ఇద్దరు నిందితులకు డైరెక్ట్ గా పరిచయం లేదు. కానీ వీరిద్దరి మధ్య ఎవరు వారధిగా పనిచేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తే ఈ విషయం వెలుగు చూసింది. 

ఈ ఇద్దరు యువతులు కొంత కాలం పాటు ఒకే రూమ్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ సమయంలోనే బాధిత యువతి నగ్న వీడియోలు బయటకు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ ఏడాది జూన్ 17వ తేదీన  పట్టాబిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు మార్చారు. 

బాధిత నగ్న వీడియోలను అప్ లోడ్ చేయడానికి ఇద్దరు యువతులు కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారని న్యూస్ ఛానల్ రిపోర్టు చేసింది. సోషల్ మీడియాలో బాధిత వీడియోలను  అప్ లోడ్  చేయడంతో ఐపీ అడ్రస్ ల ఆధారంగా  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios