విజయవాడలో యువతిపై గ్యాంగ్ రేప్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్ఐల సస్పెన్షన్

By narsimha lode  |  First Published Apr 22, 2022, 12:09 PM IST

విజయవాడలో మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న  సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.


విజయవాడ: Vijayawada లో మతిస్థిమితం లేని యువతిపై Gang Rape  ఘటనలో  విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన   సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేశారు. సీఐ హానీష్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ను తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా విజయవాడ సీపీకి  డీజీపీ  Rajendranath reddy ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 19వ తేదీన యువతిని విజయవాడ ఆసుపత్రిలో పనిచేసే  యువకుడు తీసుకెళ్లాడు. ఆసుపత్రిలోని లిఫ్ట్ పక్కన ఉన్న గదిలో యువతిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడి ఇద్దరు స్నేహితులు కూడా ఆమెపై అత్యాచాారానికి పాల్పడ్డారు. అయితే ఈ యువతి బ్యాగులో దొరికిన పోన్ నెంబర్ ను పోలీసులకు ఇచ్చారు బాధితురాలి కుటుం బ సభ్యులు . అయితే బాధితురాలు రైల్వే ట్రాక్ పక్కనో ,చెట్ల పొదల్లో ఉంటుందని పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే  ఈ ఘటన జరిగి ఉండేది కాదని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. 

Latest Videos

undefined

బాధిత కుటుంబ సబ్యుల ఒత్తిడి మేరకు ఆసుపత్రిలో పనిచేసే యువకుడిని తీసుకొచ్చి విచారిస్తే అసలు విషయం వెలుగు చూసింది. ఆఃసుపత్రిలోని రెండో ప్లోర్ లో ఉన్న లిప్ట్ పక్కనే ఉన్న గదిలో యువతిని పోలీసులు గుర్తించారు.  గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసులు  నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబం ఆరోపించింది. అంతేకాదు ఈ విషయమై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ Left పార్టీల కార్యకర్తలు గురువారం నాడు నున్న పోలీస్ స్టేషన్  వద్ద ధర్నాకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నున్న పోలీస్ స్టేషన్ వద్ద గురువారం నాడు రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న లెఫ్ట్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయవాడ వాంబే కాలనీకి చెందిన యువతిపై సామూహిక అత్యాచారం ఘటనపై పోలీసుల నిర్లక్ష్యంపై విజయవాడ సీపీ విచారణ నిర్వహించారు. ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన ఉన్నతాధికారులకు  సీఐ, ఎస్ఐల నిర్లక్ష్యం తేటతెల్లమైంది. దీంతో సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని విజయవాడ సీపీకి డీజీపీ శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేశారు.

 ప్రేమించి పెళ్లి చేసుకొంటానని నమ్మించి యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. యువతిని ఆసుపత్రిలో పనిచేసే యువకుడు తీసుకెళ్తున్న దృశ్యాలను పోలీసులు సీసీటీవీల్లో గుర్తించారు.

click me!