ఇకపోతే అంతరాష్ట్ర స్థాయీ మండలి సమావేశం అనంతరం సీఎం జగన్ అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. జగన్ నిర్ణయాలతో కేంద్రం విబేధిస్తున్న పలు అంశాలపై చర్చించనున్నారు. పోలవరం రివర్స్ టెండర్, పీపీఏల పున:సమీక్ష, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యల అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తినబాట పట్టారు. కేంద్రం పిలుపు మేరకు జగన్ కీలక సమావేశాలకు హాజరుకానున్నారు. దేశంలో వామపక్ష తీవ్రవాద పీడిత రాష్ట్రాల్లో భద్రతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు.
అందులో భాగంగా అంతరాష్ట్రస్థాయీ మండలి సమావేశంలో జగన్ పాల్గొంటారు. దేశంలో శాంతిభద్రతల అంశంపై కీలకంగా చర్చించనున్నారు. ఇకపోతే అంతరాష్ట్రస్థాయీ మండలి సమావేశానికి యూపీ, బిహార్, జార్ఖండ్, ఒడిసా, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం కేంద్రం ఆహ్వానించింది.
undefined
అయితే ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్ హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే జగన్ అంతరాష్ట్రస్థాయీ మండలి సభ్యుడి హోదాలో సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే అంతరాష్ట్ర స్థాయీ మండలి సమావేశం అనంతరం సీఎం జగన్ అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. జగన్ నిర్ణయాలతో కేంద్రం విబేధిస్తున్న పలు అంశాలపై చర్చించనున్నారు. పోలవరం రివర్స్ టెండర్, పీపీఏల పున:సమీక్ష, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యల అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే తెలుగుప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును ఇకపై కేంద్రప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా వచ్చినప్పటికీ గత ప్రభుత్వమే పనులను నిర్వహించింది.
తాజాగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుంది అంటూ రివర్స్ టెండరింగ్ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ అంశం వివాదాస్పదంగా మారింది. జల్ శక్తి మంత్రి షెకావత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి
రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?
రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...
పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్
రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్
జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు
జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు
తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్
పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ
జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం
సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం
రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ
సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్