మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?

By narsimha lode  |  First Published Jan 21, 2020, 2:23 PM IST

ఏపీ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేసే చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తీర్మానాన్ని సిద్దం చేసిందని సమాచారం. 

శాసనమండలిలో ఇవాళ చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  తీర్మానాన్ని  ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని  సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే  శాసనమండలిని రద్దు చేయడం అంత సులభం కాదని పవన్  టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు చెప్పారు.

Latest Videos

also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ

శాసనమండలిలో  టీడీపీకి 29 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి 9 మంది సభ్యులు ఉన్నారు. పీడీఎప్ కు  ఆరుగురు సభ్యులు, బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. 

Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్

Also read:జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి

Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ

Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని

టీడీపీకి శాసనమండలిలో మెజారిటీ ఉంది.  ఇవాళ శాసనమండలిలో   పాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టారు అయితే ఈ బిల్లు కంటే ముందే టీడీపీ సభ్యులు 71 రూల్ కింద నోటీసు ఇచ్చారు. 

ఈ నోటీసుపై చర్చకు శాసనమండలి ఛైర్మెన్  ఎంఏ షరీఫ్ అనుమతి ఇచ్చారు. పాలనా వీకేంద్రీకరణ బిల్లుపై చర్చను అనుమతి ఇవ్వాలని  ప్రభుత్వం కోరింది.  ఈ విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ  మండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండలి ఛైర్మెన్ స్పందించారు.

also read:మండలిలో బిల్లు: 71 కింద చర్చకు పట్టు, టీడీపీ సభ్యుల గైర్జాజర్

Also read:ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు: కౌంటర్ వ్యూహాంతో టీడీపీ

మండలిని రద్దు చేసే తీర్మానాన్ని ఏపీ సర్కార్ రెడీ చేసింది.  ఈ తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీలో  వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తోంది.ఈ విషయమై మంత్రివర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి  శాసనమండలిని రద్దు విషయమై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ విషయమై వైసీపీ నాయకత్వం చర్చిస్తుంది. 

ఇదిలా ఉంటే  శాసనమండలిని రద్దు చేయడం అంత సులభం కాదని  టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు  చెప్పారు. శాసనమండలిని రద్దు చేసే విషయమై  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
 

click me!