జగన్ ప్రభుత్వాన్ని కూల్చేదాకా నిద్రపోను, పతనం ప్రారంభం : పవన్ కళ్యాణ్

Published : Jan 21, 2020, 02:12 PM ISTUpdated : Jan 21, 2020, 02:15 PM IST
జగన్ ప్రభుత్వాన్ని కూల్చేదాకా నిద్రపోను, పతనం ప్రారంభం : పవన్ కళ్యాణ్

సారాంశం

అమరావతి రాజధాని రైతులపై పోలీసుల లాఠీచార్జి, అధికార పార్టీ నిర్బందంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని కూల్చేవరకు జనసేన పార్టీ నిద్రపోదని అన్నారు. వైసీపీ నేతలందరికీ జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ అనే నేను వార్నింగ్ ఇస్తున్నాను అని అన్నారు. 

అమరావతి: అమరావతి రాజధాని రైతులపై పోలీసుల లాఠీచార్జి, అధికార పార్టీ నిర్బందంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని కూల్చేవరకు జనసేన పార్టీ నిద్రపోదని అన్నారు. వైసీపీ నేతలందరికీ జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ అనే నేను వార్నింగ్ ఇస్తున్నాను అని అన్నారు. 

వైసీపీ నాయకులకు ఒళ్ళంతా మదమెక్కి మాట్లాడుతున్నారని, అరికాలి నుండి నడినెత్తివరకు మదం ఎక్కి కొట్టుకుంటున్నారని అంటూ కన్నీరు వస్తున్నా దాన్ని దిగమింగుకొని మాట్లాడారు పవన్ కళ్యాణ్. 

తన కోపాన్ని ఆవేదన దాటుకొని బయటకొస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆడపడుచులపై అధికారపార్టీ దాష్టీకం వారి పతనానికి నాంది అని ఆయన అన్నారు. ఆడపడుచులు, ముసలి, ముతక అనే తేడా లేకుండా అందరి మీద ఇలా పోలీసులు దౌర్జన్యం చేయడం భావ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

తాను ఏనాడూ కూడా అధికారం కోసం పాకులాడలేదని, తాను ధర్మాన్ని అనుసరించి మాత్రమే మాట్లాడుతానని, అమరావతికి తన మద్దతు తెలిపితే మిగిలిన చజొట తన పార్టీ ఏమయిపోతుందో అన్న భయం తనకు లేదని, అమరావతినే శాశ్వత రాజధానిగా ఉంచడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. 

బీజేపీతో కలిసేటప్పుడే అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి అనుకూలమా అని ప్రశ్నించానని, బీజేపీతో కలిసేటప్పుడే అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి అనుకూలమా అని ప్రశ్నించానని, అందుకు వారు కూడా తమ వైఖరి కూడా అదే అని ప్రకటించారని, అందుకోసమే తాము వారితో కలిశామని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?