ప్రజలతో మాట్లాడనిస్తే అంతా చెప్తా.. జగన్ పై దాడి కేసు నిందితుడు

By ramya neerukondaFirst Published Jan 18, 2019, 12:32 PM IST
Highlights

తనకు ప్రజలతో మాట్లాడే అవకాశం ఇస్తే.. నిజాలు అన్నీ చెబుతానని జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు అన్నారు.  


తనకు ప్రజలతో మాట్లాడే అవకాశం ఇస్తే.. నిజాలు అన్నీ చెబుతానని జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు అన్నారు.  గతేడాది వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడి  చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శ్రీనివాసరావు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. ఇటీవల అతనిని  ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. కస్టడీ గడువు ముగియడంతో అతన్ని శుక్రవారం ఎన్ఐఎ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు.

తాను జగన్ పై ఎందుకు దాడి చేశానన్న విషయాన్ని డైరెక్ట్ గా ప్రజలకే చెబుతానని.. తనకు ఆ అవకాశం ఇవ్వాలని శ్రీనివాసరావు ఈ సందర్భంగా  కోర్టును కోరాడు. జగన్ పై దాడి చేయడానికి గల కారణాన్ని తాను పుస్తకంలో రాసానని.. ఆ పుస్తకాన్ని జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారని అతను తెలిపాడు. ఆ పుస్తకం తనకు తిరిగి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉండగా.. ఎన్ఐఏ ఈ కేసు విషయంలో నిబంధనలు ఉల్లంఘించిందని శ్రీనివాసరావు తరపు లాయన్ వాదించారు. దాదాపు 30గంటల పాటు తమకు తెలియకుండా రహస్యంగా దాచి పెట్టి మరీ శ్రీనివాసరావుని ఎన్ఐఏ అధికారులు విచారనించారని లాయర్ వాదించారు. 

కాగా, విజయవాడ జైలులో శ్రీనివాస రావు ప్రాణాలకు ముప్పు ఉందని అతని తరఫు న్యాయవాది చెప్పారు. అతనికి భద్రత పెంచాలని, అతన్ని తోటి ఖైదీలతో కలవనీయకూడదని ఆయన కోర్టును కోరారు.

సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి

జగన్‌పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ ఏపీ సర్కార్ పిటిషన్

ఎన్ఐఏకు జగన్‌పై దాడి కేసు: హైకోర్టులో బాబు సర్కార్ పిటిషన్

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్ పై దాడి కేసు.. నేడు హైకోర్టులో విచారణ

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

జగన్‌ను ప్రజలే కాపాడుకొన్నారు: కన్నీళ్లు పెట్టుకొన్న విజయమ్మ

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

click me!