చంద్రబాబుతో భేటీ: కెసీఆర్ ఫ్రంట్ పై లగడపాటి నో కామెంట్

Published : Jan 18, 2019, 12:19 PM IST
చంద్రబాబుతో భేటీ: కెసీఆర్ ఫ్రంట్ పై లగడపాటి నో కామెంట్

సారాంశం

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో లగడపాటి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నెల 27వ తేదీన జరిగే శుభకార్యానికి లగడపాటి చంద్రబాబును ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

అమరావతి:  మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వేను విడుదల చేసి ఆయన తీవ్ర విమర్శలకు గురైన విషయం తెలిసిందే.

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో లగడపాటి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నెల 27వ తేదీన జరిగే శుభకార్యానికి లగడపాటి చంద్రబాబును ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ మీద మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా లగడపాటి విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే తప్పుల తడకగా తేలిన విషయం తెలిసిందే. ఆయన విడుదల చేసిన ఫలితాలకు భిన్నంగా అసలు ఫలితాలు వెలువడ్డాయి.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్