అబార్షన్ చేయించుకోలేదని భార్యని, అడ్డుగా ఉన్నారని పిల్లలను..

Published : Jan 18, 2019, 12:08 PM IST
అబార్షన్ చేయించుకోలేదని భార్యని, అడ్డుగా ఉన్నారని పిల్లలను..

సారాంశం

అబార్షన్ చేయించుకోలేదని భార్యను.. తనకు ప్రతిదాంట్లో అడ్డుగా ఉన్నారని కన్న బిడ్డలను అతి కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. 

అబార్షన్ చేయించుకోలేదని భార్యను.. తనకు ప్రతిదాంట్లో అడ్డుగా ఉన్నారని కన్న బిడ్డలను అతి కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పండ్లాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పండ్లాపురానికి చెందిన శివరామయ్యకు.. 15ఏళ్ల క్రితం వెంకటలక్ష్మమ్మతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నకానుకలు కూడా బాగానే ముట్టచెప్పారు. వీరికి పవన్ కుమార్(12), పావని(9). ప్రస్తుతం వెంకట లక్ష్మమ్మ నాలుగు నెలల గర్భిణి.

పెళ్లి జరిగిన కొన్ని నెలల పాటు వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత నుంచి శివరామయ్య భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వెంకట లక్ష్మి మళ్లీ గర్భం దాల్చడంతో,.. ఆమెను అబార్షన్ చేయించుకోవాల్సిందిగా పట్టుపట్టాడు. అయితే.. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో.. ఎలాగైనా భార్య, బిడ్డలను వదిలించుకోవాలని పథకం వేశాడు.

గురువారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న క్రమంలో.. భార్య,, బిడ్డలపై డీజిల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో.. వారు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్