తల్వార్ తో కేక్ కట్... పోలీస్ స్టేషన్ ఎదుట హల్ చల్.. 16మంది యువకులు అరెస్ట్

By Arun Kumar PFirst Published Jun 18, 2021, 10:36 AM IST
Highlights

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు, వీడియోల ఆధారంగా ముమ్మిడివరంలో తల్వార్ తో హల్ చల్ చేసిన యువకులకు గుర్తించి అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు.  

అమలాపురం: పుట్టినరోజు వేడుకల పేరుతో తల్వార్ చేతపట్టి తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసిన యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోల ఆదారంగా యువకులకు గుర్తించి అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు.  

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి ముమ్మిడివరం నగర పంచాయతీకి చెందిన యల్లమిల్లి దుర్గాప్రసాద్(చంటి) వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకను స్నేహితులతో కలిసి జరుపుకున్నాడు. ముమ్మిడివరంలోని తన ఇంటి ఎదురుగా, తిళ్ళమ్మ చెరువు దగ్గర కేక్ ను తల్వార్లతో కట్ చేశాడు. అనంతరం అదే తల్వార్ తో పట్టణంలో తిరుగుతూ హల్ చల్ చేశాడు. పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. 

యువకులందరూ కోవిడ్ 19 ఉత్తర్వులు ఉల్లంఘించినట్లు, ఫోటోలు, వీడియోలు ఆదారంగా ఆరోపణలు పోలీసుల దర్యాప్తులో రుజువు కావడంతో తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశానుసాలతో నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ తెలిపారు. ముమ్మిడివరం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాధవ రెడ్డి తెలిపారు. 

అరెస్టయిన యువకుల వద్ద నుండి ఒక కారు, 4 మోటార్ సైకిళ్ళును,4 తల్వార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  అరెస్టు చేసిన 16 మందిని యువకులను ముమ్మిడివరం మేజిస్టేట్ కోర్ట్ ముందు హాజరు పరచగా 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించినట్లు డిఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు.. 
 

click me!