Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ఫార్మూలాతో చంద్రబాబు: టీడీపీ తొలి జాబితా రెడీ

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే  అభ్యర్థులను ప్రకటిస్తానని చంద్రబాబునాయుడు ఇదివరకే ప్రకటించారు. అయితే సంక్రాంతి  తర్వాత  అభ్యర్థులను  ప్రకటించే  అవకాశం ఉంది. 

chandrababunaidu likely to release contesting candidates list on jan 17 2019
Author
Amaravathi, First Published Dec 25, 2018, 3:23 PM IST

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే  అభ్యర్థులను ప్రకటిస్తానని చంద్రబాబునాయుడు ఇదివరకే ప్రకటించారు. అయితే సంక్రాంతి  తర్వాత  అభ్యర్థులను  ప్రకటించే  అవకాశం ఉంది. అయితే  సంక్రాంతి తర్వాత మంచి ముహుర్తాన్ని  చూసుకొని చంద్రబాబునాయుడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

ఏపీలో ఫిబ్రవరి మాసంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో  అభ్యర్థుల ఎంపికను ముందుగానే పూర్తి చేయాలని  చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 మంది అభ్యర్థుల జాబితాను బాబు రెడీ చేశారు. మిగిలిన అభ్యర్థుల జాబితాకు కసరత్తు చేస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణీత షెడ్యూల్ కంటే  ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఈ పరిణామాల్లో చంద్రబాబునాయుడు కూడ  ముందస్తుకు కాకుండా అభ్యర్థుల జాబితాను ముందుగానే విడుదల చేయనున్నారు.అసెంబ్లీ రద్దు చేసిన రోజునే కేసీఆర్ 105 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. వారిలో సిట్టింగ్‌ల్లో ఒకరిద్దరికి మినహాయించి అందరికి టిక్కెట్లను కేటాయించారు. ఇదే పార్మూలాను  బాబు కూడ అమలు చేసే అవకాశం ఉంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎవరెవరికీ టిక్కెట్లు దక్కుతాయో లేదో అనే  టెన్షన్ నెలకొంది అయితే ఈ దఫా ఎన్నికల్లో  ఏపీలో విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితులు చంద్రబాబునాయుడుకు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లు ఇస్తామని బాబు పార్టీ సమీక్షలో తేల్చి చెప్పారు.

నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వ పనితీరు.  పార్టీ పనితీరుపై బాబు పలు సంస్థలతో  పాటు  నిఘా వర్గాల ద్వారా  సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా టిక్కెట్లను కేటాయించాలని భావిస్తున్నారు.

ఇప్పటికే తాను నిర్వహించిన సర్వేలకు సంబంధించి  నిఘా సంస్థలు, సర్వే సంస్థల నివేదికలతో చంద్రబాబునాయుడు సరిచూసుకొంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు హెచ్చరించారు. కానీ, కొందరు ఇంకా కూడ  పనితీరును మార్చుకోలేదని  బాబు అభిప్రాయంతో ఉన్నారు. దీంతో సిట్టింగ్‌లు తమకు టిక్కెట్లు వస్తాయో రావో అనే ఆందోళనతో ఉన్నారు.

జనవరి మాసంలో తొలి జాబితాను  సుమారు వంద మంది  అభ్యర్థులతో ప్రకటించాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే సంక్రాంతి వరకు మంచి రోజులు లేవు. సంక్రాంతి తర్వాత మంచి ముహుర్తాన్ని చూసుకొని  అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని  బాబు ప్లాన్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.జనవరి  17వ తేదీ  లేదా ఆతర్వాత ఏది మంచి ముహుర్తం ఉంటుందో ఆ రోజున అభ్యర్థుల జాబితాను విడుదల చేసే చాన్స్ ఉంటుందని  పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై బాబు కసరత్తు చేస్తున్నారు. జనవరిలో మంచి ముహుర్తం ఎప్పుడు ఉంటే ఆ రోజున అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు ఆయన సిద్దంగా ఉన్నారు. సంక్రాంతికి ఇంకా20 రోజుల గడువు ఉంది. ఈ గడువు లోపుగా  మిగిలిన స్థానాల్లో చంద్రబాబునాయుడు  అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

 

సంబంధిత వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ యూటర్న్, వైసీపీ సంబరాలు: బాబు ఫైర్

11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ఏపీకి అన్యాయం: కేంద్రంపై బాబు

నాకు కేసీఆర్ బర్త్‌డే గిఫ్ట్, భయపడను: బాబు

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీకి టీడీపీ కౌంటర్:10 అంశాలపై ఏపీ సర్కార్ శ్వేత పత్రాలు

పార్టీలో ఎమర్జెన్సీ: నేతలకు బాబు క్లాస్

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్ వరుస భేటీలు, బాబుకు దెబ్బేనా?

కారణమిదే: తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై ఏపీ టీడీపీలో జోష్

ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో: బాబుకు ఇబ్బందులేనా?

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక

శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్

 

Follow Us:
Download App:
  • android
  • ios