ICC World Cup 2023: సెంచరీల సునామీ.. గత రికార్డులన్ని బ్రేక్..
ICC World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న ICC ODI ప్రపంచ కప్ 2023లో అరుదైన రికార్డులు నమోదవుతున్నాయి. 48 ఏళ్ల ప్రపంచ కప్ చరిత్రలో ఈ ఎడిషన్ లో సెంచరీ విషయంలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఆ రికార్డు ఏంటో ?
ICC World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న 13వ ప్రపంచకప్‌లో అరుదైన రికార్డులు నమోదవుతున్నాయి. ఈ టోర్నీలో బ్యాట్స్ మెన్స్ పరుగుల పరుగుల వరద పారిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు వరకు బ్యాట్స్‌మెన్ మైదానంలో ఫోర్లు,సిక్సర్లు తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మొత్తం 10 జట్లు సెంచరీలు సాధించి 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాది రికార్డు సృష్టించాయి. గురువారం డేవిడ్ మిల్లర్ ప్రపంచ కప్ 2023లో తన 39వ సెంచరీని సాధించాడు. ఈ సెంచరీతో గతంలో ఉన్న రికార్డులు బ్రేక్ అయ్యాయి.
ఒకే మ్యాచ్‌లో తొలిసారిగా నాలుగు సెంచరీలు
ప్రస్తుత ప్రపంచకప్‌లో సెంచరీల పరంగా ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. తొలిసారి ఓ మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు కూడా నమోదయ్యాయి. పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ సెంచరీలతో ఈ అద్భుతం జరిగింది.
అత్యధిక సెంచరీలు చేసిన డి కాక్
ప్రస్తుత ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా క్వింటన్ డి కాక్ నిలిచాడు. అతడు 4 సెంచరీలు చేశాడు. కాగా, విరాట్ కోహ్లీ, రచిన్ రవీంద్ర చెరో 3 సెంచరీలు చేశారు. గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, డారిల్ మిచెల్, డేవిడ్ వార్నర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శ్రేయాస్ అయ్యర్ తలో రెండు సెంచరీలు చేశారు. ఇక రోహిత్ శర్మ, మార్క్‌రమ్, కేఎల్ రాహుల్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు ఒక్కో సెంచరీ చేశారు.
ఇక వరల్డ్ కప్ నాకౌట్స్‌లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా డేవిడ్ మిల్లర్ రికార్డు క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. ఇందులో డేవిడ్ మిల్లర్ 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి, జట్టు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు కావడానికి కారణమయ్యారు.
గత ఐదు ప్రపంచకప్‌లలో అత్యధిక సెంచరీలు
2023: 39 సెంచరీలు
2015: 38 సెంచరీలు
2019: 31 సెంచరీలు
2011: 24 సెంచరీలు
2003: 21 సెంచరీలు