Asianet News TeluguAsianet News Telugu

Shubman Gill :  శుభ్‌మన్ గిల్ భావోద్వేగ ట్వీట్ .. నెట్టింట వైరల్.. 

 IND vs AUS: ఫైనల్‌లో ఓటమి తర్వాత శుభ్‌మాన్ గిల్ తన బాధను వ్యక్తం చేశారు, 16 గంటలు గడిచినా గత రాత్రి ఓటమి తీరని బాధను మిగిల్చిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

Shubman Gill EMOTIONAL POST After Indias World Cup Final Loss Against Australia KRJ
Author
First Published Nov 21, 2023, 12:43 AM IST

Shubman Gill : భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. ఈ టోర్నీలో ఆది నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ లో తడబడటంతో కప్ చేజారింది. భారత ఆటగాళ్లు పోరాడినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో టీమిండియా ప్లేయర్లు సహా భారతీయ క్రికెట్ అభిమానులంతా ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఆటగాడు భావోద్వేగానికి గురవుతున్నారు.  ఈ క్లిష్ట సమయంలో భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో ఓటమి తర్వాత తన బాధను వ్యక్తం చేశాడు.  

ఆ బాధ ఇంకా తగ్గట్లలేదు 

దాదాపు 16 గంటలు గడిచిపోయాయి. అయినా..  గత రాత్రి ఓటమి తీరని బాధను మిగిల్చింది. కొన్నిసార్లు 100 శాతం కష్టపడ్డా.. ఆశించిన ఫలితం రాదు. మేము మా అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాం. కానీ ఈ అద్భుతమైన ప్రయాణంలో టీమిండియా బృందం గొప్ప స్ఫూర్తిని, అంకితభావాన్ని ప్రదర్శించింది. కానీ, ఈ టోర్నీ ప్రయాణంలో ప్రతి అడుగు విలువైనదే.. ఆటలో గెలుపోటములు సహజం. ఈ తరుణంలో మా అభిమానులు మాకు చాలా మద్దతు ఇచ్చారు, మేము గెలిచినా లేదా ఓడిపోయినా, అభిమానుల మద్దతు మాకు చాలా ముఖ్యం. అది మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇది అంతం కాదు.. ఆరంభం.. ఈ పోరాటం గెలిచే వరకు సాగుతుంది.  జై హింద్’ అని గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

 ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది కాకుండా.. సోషల్ మీడియా వినియోగదారులు నిరంతరం వ్యాఖ్యానించడం ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి ఈ ప్రపంచకప్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసినా ఫైనల్ మ్యాచ్‌లో 7 బంతుల్లో 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బంతికి పెవిలియన్‌కు చేరుకున్నాడు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios