Asianet News TeluguAsianet News Telugu

IND vs AUS Final: ఫైనల్‌లో టీమిండియా ఓటమికి కారణాలు ఇవే!

ICC World Cup 2023 Final:ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు ఎంతగానో ఆకట్టుకున్నారు. కానీ టైటిల్ మ్యాచ్‌లో మాత్రం అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ ఫేలవ ప్రదర్శనను కనబరిచారు. వీటిని టీమ్ ఇండియా ఓటమికి  ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అవేంటో మీరు కూడా ఓ లూక్కేయండి. 

reasons why India lost Cricket World Cup 2023 final KRJ
Author
First Published Nov 20, 2023, 6:02 AM IST

ICC World Cup 2023 Final: ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. ఆస్ట్రేలియా ముందు భారత్ కేవలం 241 పరుగుల లక్ష్యం ఉంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా  43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు. నిజానికి.. ఒకానొక సమయంలో ముగ్గురు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ 48 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే ట్రావిస్ హెడ్ , మార్నస్ లాబుస్‌చాగ్నే టీమ్ ఇండియాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.

ట్రావిస్ హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేసి నాటౌట్ గా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. కాగా, మార్నస్ లాబుషాగ్నే 110 బంతుల్లో 58 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు కొట్టాడు. ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే లు 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఆస్ట్రేలియా అలవొకగా  విజయ తీరాలను చేరింది. అయితే, టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

పేలవమైన ఫీల్డింగ్

భారత బ్యాట్స్‌మెన్ 240 పరుగులు మాత్రమే చేయగలిగారు. అటువంటి పరిస్థితిలో ఫీల్డింగ్ పై సరైన ఫోకస్ చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. కానీ, ఉత్కంఠ పోరులో టీమ్ ఇండియా ఫీల్డర్లు నిరాశపరిచారు. భారత ఫీల్డర్లు రనౌట్ అయ్యే పలు అవకాశాలను మిస్ చేశారు. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

బౌలింగ్ లో వైఫల్యం  

ఈ ప్రపంచకప్‌లో భారత బౌలర్లు ఎంతగానో ఆకట్టుకున్నారు, కానీ టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల ముందు ఫ్లాప్ అని నిరూపించారు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ నిరాశపరిచారు. టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పేలవంగా కనిపించారు.

నిరాశపరిచినా బ్యాట్స్ మెన్స్  

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా బ్యాట్స్ మెన్ నిర్ణీత వ్యవధిలో పెవిలియన్ బాట పట్టారు. ఆస్ట్రేలియన్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనను అందించారు, వాస్తవానికి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ చాలా అజాగ్రత్త షాట్లు ఆడుతూ తమ వికెట్లను వదులుకున్నారు. టీమ్ ఇండియా తరుపున విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే యాభై పరుగుల మార్కును టచ్ చేయగలిగారు. ఇది కాకుండా మిగతా బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ షోను ప్రదర్శించారు. 

అదనపు పరుగులు

భారత బౌలర్లు చాలా అదనపు పరుగులు ఇచ్చారు. ముఖ్యంగా.. ప్రారంభ ఓవర్లలో మహ్మద్ షమీ తన లైన్ అండ్ లెంగ్త్ నుండి తప్పుకున్నట్లు కనిపించాడు. ఇది కాకుండా, ఇతర బౌలర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. టీమ్ ఇండియా బౌలర్లు పేలవమైన లెంగ్త్‌లలో బౌలింగ్ చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు కంగారూ బ్యాట్స్‌మెన్ సులభంగా పరుగులు సాధిస్తూనే ఉన్నారు. ఇది కాకుండా, వికెట్ కీపర్‌గా KL రాహుల్ చాలా మిస్ ఫీల్డ్‌లు చేశాడు. భారత బౌలర్లు 18 అదనపు పరుగులు ఇచ్చారు. ఇందులో 7 బైలు,  11 వైడ్‌లు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios