Ravindra Jadeja : "ఆ క్షణాన మమ్మల్ని ప్రేరేపించాడు. మాలో ఎంతో ఉత్తేజాన్ని నింపారు".. జడేజా భావోద్వేగ ట్వీట్
World Cup 2023 Final: ప్రపంచకప్‌లో మొదటి నుంచి అధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా టీమిండియా ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయి యావత్ దేశాన్ని నిరాశకు గురి చేసింది. ఈ తరుణంలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ ఫోటోను షేర్ చేస్తూ.. భావోద్వేగ ట్వీట్ చేశారు. ఇంతటీ ఆ ట్వీట్ ఏంటి? ఆ పోస్టులో ఏం రాశారు.
World Cup 2023 Final: భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో మొదటి నుంచి అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన టీమిండియా ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచింది. ఆస్ట్రేలియా చేతిలో సొంత గడ్డపై టీమిండియా ఓటమి పాలుకావడంతో లక్షలాది మంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా చేతితో టీమిండియా ఓడిపోవడంతో ఆటగాళ్లతో పాటు అభిమానుల కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. చాలా మంది దిగ్బాంత్రికి లోనయ్యారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చారు.
టీమిండియా ఓటమి తరువాత ఆటగాళ్లను ప్రధాని మోడీ కలిసి వారికి ధైర్యాన్ని చెప్పారు. కీడ్రాకారుల ప్రతిభ, ఆట తీరు దేశానికి గర్వకారణమని, దేశం నేడు, ఎప్పటికీ మీ వెంటే ఉంటుందని టీమిండియా సభ్యులను ధైర్యం చెప్పారు. ఈ తరుణంలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన ట్విట్టర్ హ్యండిల్ లో ప్రధాని మోదీ భారత క్రికెట్ సభ్యులను కలిసి ఫోటోను పోస్టు చేశారు. ఇందులో ఆయన ప్రధాని మోదీతో కలిసి ఉండటం చూడవచ్చు. జడేజాతో పాటు టీమిండియా ఆటగాళ్లు కూడా కనిపిస్తారు.
జడేజా ప్రధాని మోడీ ఫోటోను షేర్ చేస్తూ.. ‘మేము ఈ ప్రపంచకప్ టోర్నీ మొత్తం మంచి ప్రతిభ కనబరిచాం. కానీ, చివరి ఫైనల్ మ్యాచ్ లో ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయాము.ఇది హృదయ విదారక క్షణంలో దేశ ప్రజలు మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నారు. వారు డ్రెస్సింగ్ రూం సందర్శించడం ప్రత్యేకంగా అనిపించింది, ప్రధాని మోడీ మమ్మల్ని ప్రేరేపించాడు. మాలో ఎంతో ఉత్తేజాన్ని నింపారు’ అని రాసుకొచ్చారు.
అంతకుముందు.. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ (World Cup 2023 Fianl)లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ప్రధాని మోదీ తన ఎక్స్ హ్యాండిల్‌లో టీమిండియా సభ్యులను ఉద్దేశిస్తూ ఓ పోస్టు చేశారు. “ప్రియమైన టీమ్ ఇండియా. ప్రపంచ కప్ టోర్నీలో మీ ప్రతిభ, సంకల్పం గొప్పది. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడారు. దేశానికి గర్వకారణంగా నిలిచారు. మేమంతా ఈ రోజు, ఎల్లప్పుడూ మీతో ఉంటాం ’’. అని టీమిండియాకు ప్రధాని ధైర్యాన్ని ఇచ్చారు.
అదే సమయంలో విశ్వ విజేత నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపారు. ప్రపంచకప్‌లో అద్భుత విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ప్రశంసించారు ప్రధాని మోదీ. టోర్నమెంట్ అంతటా మీ ప్రదర్శన ప్రశంసనీయం, ఈ టోర్నీ మీ అద్భుతమైన విజయంతో ముగిసింది. ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆటతీరు అభినందనీయమని పేర్కొన్నారు.