IND Vs AUS Final: భారత్ ఓటమిపై ప్రధాని మోదీ స్పందన.. ఏమన్నారంటే..?
IND Vs AUS Final: భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టీమిండియా సొంత గడ్డపై మట్టి కరిపించింది. టీమిండియా నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ టీం అలవొకగా కేవలం 43 ఓవర్లలోనే మూడు కోల్పోయి చేధించింది. ఆరోసారి చాంపియన్ గా నిలిచింది. భారత్ ఓటమిపై ప్రధాని మోదీ స్పందన.. ఏమన్నారంటే..?
IND Vs AUS Final: భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టీమిండియా సొంత గడ్డపై మట్టి కరిపించింది. టీమిండియా నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ టీం అలవొకగా
కేవలం 43 ఓవర్లలోనే మూడు కోల్పోయి చేధించింది. ఆరోసారి చాంపియన్ గా నిలిచింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆదివారం (నవంబర్ 19) జరిగిన ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ప్రధాని మోదీ తన ఎక్స్ హ్యాండిల్‌లో ఇలా రాశారు. “ప్రియమైన టీమ్ ఇండియా, ప్రపంచ కప్ సమయంలో మీ ప్రతిభ, సంకల్పం గొప్పది. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడారు. దేశానికి గొప్ప గర్వం తెచ్చారు. మేము ఈ రోజు, ఎల్లప్పుడూ మీతో ఉంటాము. అని టీమిండియాకు ప్రధాని ధైర్యాన్ని ఇచ్చారు.
ఆస్ట్రేలియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ఆస్ట్రేలియా జట్టు ప్రపంచకప్‌ను గెలుపొందడంపై ప్రధాని మోదీ మరో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచకప్‌లో అద్భుత విజయం సాధించిన ఆస్ట్రేలియాకు అభినందనలు అని ప్రధాని మోదీ రాశారు. టోర్నమెంట్ అంతటా మీ ప్రదర్శన ప్రశంసనీయం, ఈ టోర్నీ మీ అద్భుతమైన విజయంతో ముగిసింది. ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆటతీరు అభినందనీయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపారు. భారత్ బాగా ఆడి హృదయాలను గెలుచుకుందని అన్నాడు. మీ ప్రతిభ, క్రీడాస్ఫూర్తి మ్యాచ్‌లో కనిపించాయి. ప్రపంచకప్‌లో మీ అద్భుతమైన ప్రదర్శనకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రోత్సహిస్తాము. మీ విజయాలను గౌరవిస్తామని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ అభినందనలు
మొత్తం టోర్నీలో మీరు అద్బుత ప్రదర్శన ఇచ్చారని టీమ్ ఇండియా ఓటమిపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. గెలిచినా ఓడినా - మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మనం ఖచ్చితంగా తదుపరి ప్రపంచ కప్ గెలుస్తాం. ప్రపంచకప్‌లో అద్భుత విజయం సాధించిన ఆస్ట్రేలియాకు అభినందనలు తెలిపారు.