ICC World Cup 2023: 20 ఏళ్ల పగకు వరుణుడు సహకరించేనా..? ఒక వేళ మ్యాచ్ రద్దయితే..
ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా హోరాహోరీగా తలపడునున్నాయి. ఈ ఫైనల్ సమరానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానున్నది. అయితే.. నవంబర్ 19న అహ్మదాబాద్ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
ICC World Cup 2023: భారత్ అతిథ్యమిస్తున్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో టీమిండియాతో తలపడే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య తుది సమరం జరుగనుంది. 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే.. నవంబర్ 19న అహ్మదాబాద్ వాతావరణం ఎలా ఉంటుందో మ్యాచ్‌కి ముందు తెలుసుకుందాం..
Accuweather నివేదికల ప్రకారం.. నవంబర్ 19న అహ్మదాబాద్ వాతావరణం స్పష్టంగా ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల వరకు నమోదు అవకాశాలు ఉన్నాయి. అదే మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం లేదు. అంటే.. అభిమానులు ఈ మ్యాచ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ వీక్షించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల సాయంత్రం పూట గ్రౌండ్ లో మంచు కురిసే అవకాశం ఉంది.
మ్యాచ్ రద్దయితే..
ఇలాంటి పరిస్థితుల్లో వర్షం పడితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం లేనప్పటికీ కొన్ని కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోతే.. ఐసిసి దాని కోసం రిజర్వ్ డే ఉంచింది. అంటే మరుసటి రోజు నవంబర్ 20న ఇరు జట్లు ఒకే మైదానంలో తలపడుతాయి. కానీ, క్రికెట్ అభిమానులు నవంబర్ 19 రాత్రి 2023 ప్రపంచ కప్‌లో విజేతను కనుగొంటారని భావిస్తున్నారు.
కాగా.. 20 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా, భారత్ జట్టు టైటిల్ కోసం తలపడనున్నాయి. 2003లో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియాపై కంగరు టీం విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా టీం ఎనిమిదో సారు వరల్డ్ కప్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. 1975, 1996 లో రన్నరప్ నిలువగా.. 1987, 2003, 1999 , 2007 , 2015 లలో టైటిల్ పోరులో విజయం సాధించింది. ఇందులో ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా.. మరోసారి కప్ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది.