Asianet News TeluguAsianet News Telugu

ICC World Cup 2023: అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమా ? రోహిత్ సేన ప్రత్యేక వ్యూహాం రచించాల్సిందేనా?

World Cup 2023 IND vs AUS: ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్న‌మెంట్ లో ఓటమి ఎరుగని టీమిండియాకు, ఆరో సారి క‌ప్పుకొట్టాలని ఉవ్విళ్లూరుతున్న ఆసీస్ జట్టు మధ్య టైటిల్ పోరు జరుగనున్నది. ఈ హోరాహోరీ ఫైనల్ పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానున్నది. ఈ అమీతుమీ మ్యాచ్ లో ఏ జట్టు విశ్వ విజేత నిలుస్తుందనే ఉత్కంఠగా మారింది. అయితే.. నరేంద్ర మోడీ స్టేడియంలో ఇరు జట్ల గ‌ణాంకాలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లూక్కేయండి.  

ICC World Cup 2023 Final IND vs AUS ODI Head To Head Records in Narendra Modi Stadium, Ahmedabad KRJ
Author
First Published Nov 17, 2023, 2:01 PM IST

World Cup 2023 IND vs AUS: భారత్ అతిథ్యమిస్తున్న ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 చివరి దశకు చేరుకుంది. ఆరోసారి క‌ప్పు కొట్టి విశ్వవిజేతగా నిలువాలని భావిస్తున్న పాట్ కమిన్స్ నాయ‌క‌త్వంలోని ఆస్ట్రేలియా జట్టు, ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో ఓట‌మి ఎగురుని జట్టుగా జైత్ర యాత్ర‌ కొన‌సాగిస్తున్న టీమిండియా ఫైన‌ల్ లో అడుగుపెట్టాయి. నవంబర్ 19న ఈ ఇరు జట్ల మధ్య జరిగే హోరాహోరీ పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానున్నది. ఈ తరుణంలో నరేంద్ర మోడీ స్టేడియంలో ఇరు జట్ల జయాపజయాలను పరిశీలిస్తే..  

నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి వరకు 6 వన్డే మ్యాచ్‌లు ఆడగా, అందులో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు ఈ మైదానంలో భారత జట్టు 19 వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఇందులో టీమ్ ఇండియా 11 మ్యాచ్‌లు గెలిచి, 8 మ్యాచుల్లో ఓటమి పాలైంది.  గెలిచిన 11 మ్యాచుల్లో టీమిండియా 5 సార్లు తొలుత బ్యాటింగ్ చేయగా.. 6 సార్లు చేజింగ్ లోనే గెలుపోంది.ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. గెలిచిన 4 మ్యాచుల్లో చేజింగ్ లో ఒక సారి గెలువగా.. 3 సార్లు తొలుత బ్యాటింగ్ చేస్తే గెలిచింది. 

ఇక ఈ గ్రౌండ్ లో టీమిండియా రెండుసార్లు ఆస్ట్రేలియాను ఓడించింది. ముందుగా ఈ మైదానంలో 1986లో వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా, ఆ తర్వాత 2011లో కూడా ఈ మైదానంలో కంగారూ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో పోలిస్తే.. టీమిండియా కాస్త వెనుకపడే ఉంది. టీమిండియా టెన్షన్ కాస్త పెరిగింది. ఇది కొంత ఆందోళన కలిగించే విషయమే. అయితే ప్రస్తుతం టీమ్ ఇండియా  ఫామ్‌ను పరిశీలిస్తే.. గత రికార్డులను తిరగ రాయడం అంత కష్టమేమి కాదు.

ఓటమి ఎరుగని టీమిండియా 
 
ప్రపంచ కప్ 2023లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఈ మెగా టోర్నమెంట్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలోనూ టీమిండియా విజయం సాధించింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాను కూడా టీమిండియా ఓడింది. ఫైనల్ మ్యాచ్ లో మరోసారి ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. 20 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌లో తలపడబోతున్నాయి. 

అంతకుముందు.. 2003 ODI ప్రపంచకప్‌లో ఈ ఇరు జట్లు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ సేనకు సువర్ణావకాశం వచ్చింది.  ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని క్రికెట్ లవర్స్ భావిస్తున్నారు. ఏ జట్టు విశ్వ విజేతగా నిలుస్తుందో? ఫైనల్ పోరు తుది వరకు వేచి చూడాల్సిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios