IND Vs NZ: డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రపంచ రికార్డు.. కింగ్ కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు ఎంత మంది చూశారో తెలుసా?
IND vs NZ semi-final: డిస్నీహాట్ స్టార్ (Disneyplus Hotstar) చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ లో హాట్‌స్టార్ రికార్డు స్థాయిలో రియల్ టైమ్ వ్యూస్‌ను రాబట్టింది. కింగ్ కోహ్లీ క్రీజ్ లో ఉన్నప్పుడు ఎంత మంది చూశారో తెలుసా..?
Disneyplus Hotstar Record: క్రికెట్ అంటే ఎంతో క్రేజో అందరికీ తెలుసు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మందికి క్రికెట్ అంటే పిచ్చి. ఇక అందులోనూ వర్డల్ కప్. అది కూడా గత నాలుగు ఏండ్ల క్రితం భారత్ ను సెమీస్ లో ఓడించి ప్రపంచ కప్ పోరును బయటికి పంపిన జట్టుతో మరోసారి సెమీ ఫైనల్ లో భారత్ తలపడితే.. ఆ మ్యాచ్ ను ఏ క్రికెట్ అభిమాని అయినా చూడకుండా ఉండగలదా ? ఏ క్రికెట్ లవర్ అయినా.. ఈ మ్యాచ్ ను మిస్ కాకుండా చూస్తాడు. ఇలాంటి తరుణంలో అద్భుతం ఆవిష్కృతమైంది ఓ అరుదైన రికార్డు సృష్టించబడింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండీ..
కోట్లాది భారతీయుల ఆశలను టీమిండియా పదిలంగా మోసుకుంటూ ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో ఫైనల్లోకి అడుగుపెట్టింది. వాంఖడే స్టేడియం వేదికగా న్యూజీలాండ్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో రోహిత్ సేన 70 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ .. తన ఫేవరేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (49) సెంచరీల రికార్డును అధిగమిస్తూ వాంఖడేలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కివీస్ బౌలర్లను చీల్చిచెండాడుతూ వన్డేల్లో 50వ సెంచరీని పూర్తి చేసి..వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా నిలిచారు. అదే సమయంలో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (711) చేసిన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ..
ఈ అద్బుత ఘట్టాలను ప్రత్యేకంగా వేలాది అభిమానులు మంది చూస్తే.. పరోక్షంగా టీవీలు, ఫోన్లలో కోట్లాదిలా మంది అభిమానులు వీక్షించారు. ఈ తరుణంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ లో మరి ముఖ్యంగా కింగ్ కోహ్లీ క్రిజ్ లో ఉన్నంత సేపు.. అందులోనూ 50వ సెంచరీ పూర్తయిన క్షణాన హాట్ స్టార్ రియల్ టైమ్ వ్యూస్ గత రికార్డులను బద్దలు కొడుతూ.. 53 మిలియన్లకు చేరింది. అంటే.. ఓ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లోనే 5.3 కోట్ల మంది వీక్షించారన్న మాట. హాట్ స్టార్ రియల్ టైమ్ వ్యూస్ లో ఇది కొత్త రికార్డు.
ఈ మ్యాచ్ లో వ్యూస్ సంఖ్య ఏ సమయంలోనూ 40 మిలియన్లకు తగ్గలేదు. ఇదే వన్డే ప్రపంచకప్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో గరిష్టంగా 44 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ వచ్చాయి. ఇదే హై రియల్ టైమ్ వ్యూస్ గా ఉండేది.కానీ ఆ రికార్డు తాజా మ్యాచ్‌లో బద్దలయ్యింది.
Disneyplus Hotstar ఈ సారి ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా వర్డల్ కప్ మ్యాచ్‌లు ఫ్రీగా చూసే అవకాశం కల్పించడంతో ఇలా రికార్డు స్తాయిలో వ్యూస్ నమోదు అవుతున్నాయి. జియో సినిమా గతంలో ఆసియాకప్ ను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసే ఆస్కారం కల్పించింది. ఇదే ఇలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ లో ఈ రికార్డులన్ని బద్దలయ్యే అవకాశం ఉంది.