కదిలే డైనింగ్ టేబుల్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, నెటిజన్ల రియాక్షన్ ఇదే..!

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన.. ఆలోచింప చేసే విషయాలు, ఫన్నీగా అనిపించే విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా.. ఇలానే ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో మొబైల్ డైనింగ్ టేబుల్ ఉండటం విశేషం.

Anand Mahindra shares  video of unique vehicle where one can eat and travel

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇళ్లల్లో డైనింగ్ టేబుల్ ఉంటోంది. ఆ డైనింగ్ టేబుల్ పై కూర్చొని భోజనం చేయడానికే  అందరూ ఇష్టపడుతున్నారు. అయితే.. అదే డైనింగ్ టేబుల్ పై మనం కూర్చొని.. మనం ఎక్కడకు కావాలంటే అక్కడకు అది వెళుతూ... ఆ వెళ్లిన ప్రదేశంలో అదే డైనింగ్ టేబుల్ పై కూర్చొని తింటే ఎలా ఉంటుది..? అసలు ఇది సాధ్యమేనా అని మీకు అనిపించవచ్చు. కానీ సాధ్యమే అంటారు మీరు కూడా ఈ కింద వీడియో చూశారంటే..

ఇంతకీ మ్యాటరేంటంటే... ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా.. తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన.. ఆలోచింప చేసే విషయాలు, ఫన్నీగా అనిపించే విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా.. ఇలానే ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో మొబైల్ డైనింగ్ టేబుల్ ఉండటం విశేషం.

ఆ టేబుల్ ఎటు కావాలంటే అటు వెళ్తుంది. కేవలం ఇంట్లోనే కాదు.. దానిపై కూర్చొని భోజనం చేస్తూనే.. ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్లొచ్చు. నలుగురు వ్యక్తులు ఆ టేబుల్ పై కూర్చొని వెళ్తుండటం ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. చాలా వినూత్నంగా ఉన్న ఈ వీడియోని ఆయన షేర్ చేశారు. ఆహార ప్రియులకు ఈ మొబైల్ డైనింగ్ టేబుల్ విపరీతంగా నచ్చడం ఖాయం.

 

దానికి ఆయన ఇచ్చిన క్యాప్షన్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘I guess this is e-mobility. Where ‘e’ stands for eat…’ అంటూ ఆయన ఇచ్చిన క్యాప్షన్ అందరినీ నవ్విస్తోంది. కానీ.. ఇలాంటి కదిలే డైనింగ్ టేబుల్ ఐడియా మాత్రం ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది ఎక్కడ తీశారు అనేది క్లారిటీ లేదు కానీ.. వీడియో మాత్రం వైరల్ గా మారింది.


ఈ వీడియోని ఇప్పటి వరకు 2.3 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. ఇక దీని కింద కామెంట్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.. కామెంట్ల వర్షం కురుస్తోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios