Lok Sabha Speaker Om Birla: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేరిట నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారు సైబర్ నేరగాళ్లు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. గత నెలలో, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేరిట కూడా నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించి..ఆర్థిక సహాయం కోరుతూ వీఐపీలతో సహా వ్యక్తులకు సందేశాలు పంపారు. దీంతో ఆయన కార్యాలయం హోం మంత్రిత్వ శాఖను అప్రమత్తం చేసింది.