Israel Palestine War: హమాస్, ఇజ్రాయెల్ మధ్య 11వ రోజు యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10:30 గంటలకు గాజా స్ట్రిప్‌లోని అల్ అహ్లీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందని, అందులో 500 మంది మరణించారని హమాస్ పేర్కొంది. ఈ దాడి నిర్ధారణ అయితే.. ఇది 2008 తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అత్యంత ఘోరమైన దాడి అవుతుంది.