Serena Williams : సంచలన ప్రకటన చేసిన సెరెనా విలియమ్స్.. ‘కౌంట్ డౌన్ మొదలైంది’ అంటూ ట్వీట్..

టెన్నీస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఇక టెన్నిస్ కు గుడ్ బై చెప్పనుందా? అంటే అవుననే అంటున్నాయి ఆమె చేస్తున్న ట్వీట్స్. ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే హింట్ ఇచ్చారామె.

 

Serena Williams made sensational announcement on Retirement

న్యూఢిల్లీ : అమెరికా టెన్నిస్ స్టార్ Serena Williams సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టెన్నిస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు హింట్ ఇచ్చింది. 1999లో తొలిసారి యూఎస్ ఓపెన్ గెలుచుకున్నప్పటినుంచి టెన్నిస్ కు ఐకాన్ గా మారి 23 Grand Slamఛాంపియన్షిప్ లను గెలుచుకున్న సెరెనా.. ఓ మ్యాగజైన్ తో మాట్లాడుతూ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంది. వచ్చే నెలలో ఓ టోర్నీ ఆడేసి టెన్నిస్ గుడ్బై చెప్పాలనుకుంటున్నట్లు  తెలిపింది.

దశాబ్దాల పాటు  టెన్నిస్ ను ఏలిన  విలియమ్స్ ‘రిటైర్మెంట్’ అనే పదం తనకు నచ్చదని పేర్కొంది. దానికి బదులుగా ‘పరిణామం’  అనే పదాన్ని ఉపయోగించేందుకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొంది. తను టెన్నిస్కు దూరంగా ముఖ్యమైన ఇతర విషయాల వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. కుటుంబంపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. అయితే, టెన్నిస్ నుంచి కచ్చితంగా  ఎప్పుడు తప్పుకుంటానన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. యూఎస్ ఓపెన్ తన చివరి టోర్నమెంట్ అవుతుందని ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ద్వారా రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నట్లు చెప్పకనే చెప్పింది. 

OSCARS 2022: ఆస్కార్ అవార్డులలో హొయలొలికించిన నల్లకలువలు.. టాప్ లేపే అందాలతో నెక్స్ట్ లెవల్ గ్లామర్ షో

అంతే కాదు, ‘కౌంట్ డౌన్ మొదలైంది’ అని కూడా రాసుకొచ్చింది. ‘రాబోయే కొన్ని వారాల్లో ఆనందాన్ని పొందబోతున్నాను’ అని చెప్పడం ద్వారా రిటైర్మెంట్ కు మానసికంగా సిద్ధమైందని తెలుస్తోంది.  తాను, తన భర్త  అలెక్సిస్ ఒహానియన్  కలిసి మరో బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంటున్నట్లు 40 ఏళ్ల విలియంస్ పేర్కొంది. తాను అథ్లెట్ గా,  గర్భవతిగా ఉండాలని అనుకోవడం లేదని స్పష్టం చేసింది. విలియమ్స్ 2017లో చివరి గ్రాండ్స్లామ్ గెలిచినప్పుడు గర్భవతిగా ఉంది. జూన్ లో వింబుల్డన్ నుంచి తొలిరౌండ్లోనే తప్పుకుంది. కాగా, విలియం ప్రైజ్ మనీ రూపంలో దాదాపు 100 మిలియన్ డాలర్లు గెలుచుకుంది. 

ఇదిలా ఉండగా, గత మార్చిలో లాస్ ఏంజెల్స్ లో జరిగిన 94వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.  లాస్ ఏంజెల్స్ లో జరిగిన అకాడమీ అవార్డుల కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ.. తమ గ్లామర్ తో అక్కడున్న వారందరినీ చూపు తిప్పుకోనివ్వకుండా ఆకట్టుకున్నారు. 

విలియమ్స్ సిస్టర్స్ తండ్రి కథతో తీసిన సినిమా ‘కింగ్ రిచర్డ్’ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులో ఐదు అవార్డులకు నామినేట్ అయింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ ఆ వేదిక మీద మెరిశారు. వారి తండ్రి రిచర్డ్ విలియమ్స్ చిన్నవయసులోనే ఈ ఇద్దరికీ దగ్గరుండి టెన్నిస్ నేర్పించడం, వీరిని ప్రపంచ నెంబర్ వన్ లుగా తీర్చిదిద్దడం లాంటి అనేక అంశాలు ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ పాత్రకు ప్రాణం పోశాడు హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్. ఈ చిత్రంలో అతడి నటనకు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఈ సినిమాకు ఈ అక్కాచెళ్లెల్లు ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించడం మరో విశేషం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios