కోట్లాది మంది అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో ఓటమిపాలు కావడంపై అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ స్పందించారు. బియాంక చాలా బాగా ఆడింది. కానీ ఈ టోర్నమెంట్‌లో తాను ఆడిన అత్యంత చెత్త మ్యాచ్ ఇదేనని.. నా ఆట తీరు క్షమించరానిదని సెరెనా వ్యాఖ్యానించారు.

బియాంక మంచి ప్లేయర్.. ఆట ప్రారంభంలోనే ఆమె తనను ఒత్తిడిలోకి నెట్టిందని సెరెనా అన్నారు. 33 సార్లు మేజర్ టైటిల్స్ గెలిచిన సెరెనా విలియమ్స్.. బియాంక విషయంలో చేసిన చిన్న చిన్న తప్పులు ఆమెకు యూఎస్ ఓపెన్ టైటిల్‌‌ను దూరం చేసింది.

ఈ మ్యాచ్ ద్వారా ఫైనల్స్‌లో ఎలాంటి ఆటను ఆడాలో బాగా తెలిసిందని సెరెనా స్పష్టం చేసింది. ప్రస్తుతం నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.. తాను రికార్డులను బద్ధలు కొట్టాలనుకోవడం లేదని.. కేవలం గ్రాండ్ స్లామ్ గెలిచేందుకే పోరాడనని సెరెనా స్పష్టం చేశారు.

ఈ ఓటమి బాధను మిగులుస్తుంది.. అయితే ఏం చేయాలో తనకు తెలుసన్నారు. సెరెనా ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిస్తే మార్గరెట్ కోర్ట్స్ పేరిట ఉన్న అల్ టైమ్ రికార్డును బద్ధలు కొడుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత తిరిగి టెన్నిస్ బ్యాట్ పట్టుకున్న సెరెనా గతేడాది వింబుల్డన్‌ టైటిల్‌ను తృుటిలో చేజార్చుకుంది. 

సంచలనం: యూఎస్ ఓపెన్‌లో ఓటమిపాలైన సెరెనా విలియమ్స్